BREAKING
ఘనంగా పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ స్పష్టీకరణ.. పెద్దేముల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా లొంక నర్సింలు పేరు సిఫారసు 'కిల్లర్' ట్రైలర్ లాంచ్.. పూర్వాజ్ సక్సెస్ సాధించాలి అన్న హరీష్ శంకర్! ప్రశాంత వాతావరణంలో నామినేషన్లు పక్రియ...ఎంపీ లావు అర్హులకు సంక్షేమ పథకాలు.. అందరికీ అభివృద్ధి ఫలాలు..జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఏడాది పాలనపై ప్రత్యేక కథనం రోడ్డు ప్రమాదంలో భవాని భక్తుల మృతి బాధాకరం! కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తమిళ లీగల్ థ్రిల్లర్ 'ఎన్న విలై' మూవీ రివ్యూ.. ఆకట్టుకునేలా ఉందా? కొత్తగూడెం ఘటనపై సమగ్ర విచారణ జరపాలి-పరకాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బిజెపి నేతలు విజేతలకు బహుమతుల పంపిణీ ఎన్నికల సంఘం తీరుపై వైసీపీ నిరసన క్యాన్సర్ బాధితునికి బిఆర్ఎస్ యువజన విభాగం ఆర్థిక సాయం పారిశుద్ధ కార్మికుల భద్రతకు ప్రాధాన్యత-విధి నిర్వహణలో తప్పనిసరిగా రక్షణ పరికరాలు వినియోగించాలి నెక్కుంది టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా కే మనోహర్ డబ్బాకుపల్లి, పెంటేలవారిగూడెం ఎంపీటీసీ అభ్యర్థిగా పెంటేల స్వప్న నామినేషన్ మాజీ సర్పంచ్ కొత్త రంగారెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పరామర్శ

బెదిరింపులతో ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోలేరు -నామినేషన్లు అడ్డుకోవడంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి : ఎంపీ గురుమూర్తి

Select Suryaa Now
బెదిరింపులతో ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోలేరు  -నామినేషన్లు అడ్డుకోవడంపై ఎన్నికల సంఘం  చర్యలు తీసుకోవాలి : ఎంపీ గురుమూర్తి

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : బెదిరింపులతో ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలనుకోవడం సిగ్గుచేటని ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేయడం అర్హులైన అభ్యర్యులందరికి రాజ్యాంగం కల్పించిన హక్కు, అలాంటి హక్కును బెదిరింపులతో కాలరాయాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని ధ్వజమెత్తారు. వెంకటగిరి నియోజకవర్గం కలువాయిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకొని బెదిరింపులకి గురి చేసిన సంఘటనల గురించి ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఎన్నికల సంఘానికి ఎంపి ఫిర్యాదు

ఈ నెల 19న కలువాయిలో జరిగిన టీడీపీ నాయకుల సమావేశంలో వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకోవాలని, అవసరమైతే వారిపై దాడులు చేయాలని పిలుపునిచ్చిన అంశాన్ని ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు ఎంపీ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇలా పిలుపునివ్వడం అత్యంత తీవ్రమైన విషయమని, ఎన్నికల ప్రక్రియలో భయానక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలను ఏమాత్రం ఉపేక్షించరాదని ఎంపీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎన్నికల్లో ప్రజల మద్దతు కోరాల్సిన రాజకీయ పార్టీలు, ప్రత్యర్థి అభ్యర్థులను భయపెట్టి పోటీ నుంచి తప్పించాలని ప్రయత్నించడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. 

ఈసీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

ప్రజాస్వామ్యంలో గెలుపోటములు ప్రజల తీర్పుతో నిర్ణయించబడాలి తప్ప, బెదిరింపులు, దౌర్జన్యాలు, భౌతిక దాడుల భయంతో కాదని హితవు పలికారు. ప్రతి అర్హుడైన అభ్యర్థి ఎలాంటి ఒత్తిడులు, అడ్డంకులు లేకుండా నామినేషన్ దాఖలు చేసుకునేలా ఎన్నికల యంత్రాంగం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని, అందుబాటులో ఉన్న వీడియో రికార్డులు, ఇతర ఆధారాలను భద్రపరిచి నిష్పక్షపాతంగా పరిశీలించాలని ఎంపీ ఎన్నికల సంఘాన్ని కోరారు. నామినేషన్ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో తగిన పోలీసు భద్రత కల్పించాలని, బెదిరింపులు ఎదుర్కొంటున్న అభ్యర్థుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆరోపణలు విచారణలో నిర్ధారణ అయితే, సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎంపీ చేసిన ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ తగు చర్యలు తీసుకోవాలని డీజీపీ, తిరుపతి జిల్లా కలెక్టర్ లను ఆదేశించింది. 

ప్రతి అభ్యర్థి హక్కులను ఈసీ కాపాడాలి

రాజకీయాలకు అతీతంగా ప్రతి అభ్యర్థి నామినేషన్ హక్కును కాపాడటం ఎన్నికల సంఘం బాధ్యత. ప్రజాస్వామ్య ప్రక్రియను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలను అరికట్టి, స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలు జరిగేలా ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఎంపీ డిమాండ్ చేశారు.