ఎన్నికల సంఘం తీరుపై వైసీపీ నిరసన
విజయవాడలో ఉద్రిక్తత.. ఎస్ఈసీ కార్యాలయం ముందు వైఎస్సార్‌సీపీ నేతల బైఠాయింపు, ధర్నా!
విజయవాడ: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారంటూ ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు మరోసారి రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కార్యాలయానికి వెళ్లారు. నామినేషన్ల దాఖలులో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రత్యర్థుల దాడులపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసేందుకు వారు ఈ యాత్ర చేపట్టారు.
అయితే, ఎన్నికల సంఘం అధికారుల స్పందనపై వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సాయంత్రం వేళ కలుస్తామని ఎస్ఈసీ చెప్పడంపై, తొలుత జాయింట్ డైరెక్టర్‌ను కలిసి వెళ్లాలని సూచించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేటించారు. నేరుగా ఎస్ఈసీని తాము కలవాల్సిందేనంటూ కార్యాలయం వద్ద పట్టుబట్టారు.
ఈ క్రమంలో ఎస్ఈసీ అధికారుల తీరుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ నేతలు కార్యాలయం గేటు ముందే బైఠాయించి ఆందోళన, ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పోలీసులు భారీగా మోహరించారు.