శ్రీ బోయకొండ గంగమ్మ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు
శ్రీ బోయకొండ గంగమ్మ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు
60 రోజుల హుండీ లెక్కింపులో బంగారం, వెండి, విదేశీ కరెన్సీ లభ్యం
చౌడేపల్లి, అక్టోబర్ 22: అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లిలో వెలసిన ప్రముఖ శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో గురువారం నిర్వహించిన హుండీ లెక్కింపులో 60 రోజులకు సంబంధించి రూ.69,86,480 నగదు ఆదాయం లభించింది. భక్తులు సమర్పించిన బంగారం, వెండి, విదేశీ కరెన్సీని కూడా అధికారులు లెక్కించారు.
హుండీ లెక్కింపులో 26.400 గ్రాముల బంగారం, 315.510 గ్రాముల వెండి లభించినట్లు దేవస్థాన అధికారులు వెల్లడించారు. అమెరికా డాలర్లు, ఖతార్ రియాళ్లు, కువైట్ దినార్లు, ట్రినిడాడ్ అండ్ టొబాగో డాలర్లతో పాటు ఇతర విదేశీ కరెన్సీ నోట్లు కూడా లభించాయి.
అదేవిధంగా, అన్నదాన హుండీల ద్వారా రూ.48,985 ఆదాయం సమకూరగా, శ్రీ నాన్నభేరి గంగమ్మ దేవస్థానానికి సంబంధించి రూ.53,053 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థాన ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ జె. ఏకాంబరం, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు చౌడేపల్లి సిబ్బంది, దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
సి .శ్రీనివాసులు మదనపల్లి సూర్య స్టాఫ్ రిపోర్టర్