ఎంఫార్మసీ, బీఫార్మసీ పేమెంట్ సీట్ల స్పాట్ అడ్మిషన్లు
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్వీయూ ఫార్మసీ కళాశాలలో ఎంఫార్మసీ, బీఫార్మసీ కోర్సులలో చేరదలచిన విద్యార్థులు ప్రత్యేక పేమెంట్ సీట్లకు సంబంధించి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ భూపతి నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. జీఫ్యాట్ రాసినవారికి తొలిప్రాధాన్యత, ఏపీపీజీఈసెట్ అర్హులకు రెండవ ప్రాధాన్యత, మిగిలిన వారికి మూడవ ప్రాధాన్యత ఉంటుందని తెలియజేశారు. ఎంఫార్మసీ కోర్సుకు ఏడాదికి రూ.1,66,925లు చెల్లించాల్సి ఉంటుందని, బీఫార్మసీ కోర్సుకు ఏడాదికి రూ.81వేలు చెల్లించాలని వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాలకు వర్సిటీలోని డీఓఏ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్