కాకాణి సమక్షంలో తెలుగుదేశంని వీడి వైఎస్ఆర్‌సీపీలో చేరిన 50 కుటుంబాలు
సర్వేపల్లి, మేజర్ న్యూస్ : సర్వేపల్లిలో టీడీపీ కథ కంచికే…సోమిరెడ్డి వద్దు బాబోయి అంటున్న జనం. పార్టీ కండువాలు కప్పి, సాదరంగా ఆహ్వానించిన మాజీ మంత్రి కాకాణి సర్వేపల్లి లో రోజు, రోజుకి డల్ అవుతున్న టీడీపి..ఫుల్ జోష్ లో వైయస్సార్ సీపీ నెల్లూరులోని మాజీ మంత్రి కాకాణి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు "డా" కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి నివాసంలో, తోటపల్లిగూడూరు మండలం సౌత్ ఆమలూరు గ్రామానికి చెందిన 50 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి కాకాణి టిడిపిని వీడి వైఎస్ఆర్ సీపీలో చేరిన, కోడి రవి, కోడి శ్రీనివాసులు, ఇంట్లూరు లోకేష్, మబ్బు అనీల్, ఇంట్లూరు అనీల్, చక్రి, రవి, ప్రేమ్, డేవిడ్, ఎనూష, తదితరులు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... సౌత్ ఆమలూరు గ్రామానికి సంబంధించిన స్థానిక వైఎస్ఆర్ సీపీ నాయకుల ఆధ్వర్యంలో రవి, శ్రీను, లోకేష్, తదితరులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరడం సంతోషంగా ఉందన్నారు. అధికారాన్ని వదులుకొని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని, సౌత్ ఆమలూరు గ్రామానికి చెందిన 50 కుటుంబాలు ,ముఖ్యంగా యువత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆహ్వానించదగిన విషయం అన్నారు గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కొన్ని విభేదాల వల్ల దూరమయ్యారని . "ఎవరు మన, ఎవరు తన" అని తెలుసుకున్న తర్వాత, తిరిగి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి, పార్టీకి నష్టం కలిగించేటువంటి వాళ్ళని చాలా రోజుల క్రితమే పార్టీ నుంచి తరిమివేయడం జరిగిందని. పార్టీని నష్టపరిచేవారు , గ్రామాల్లో పది ఓట్లు పోగొట్టేటువంటి వాళ్ళ వల్లనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గత 2024 ఎన్నికల్లో కూడా నష్టపోవడం జరిగిందని పేర్కొన్నారు మేము తీసి పారేసినటువంటి స్క్రాప్ ని ( పార్టీ నుండి తొలగించిన వారిని)చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ లో చేర్చుకుని,వాళ్ళంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విడిచి, తెలుగుదేశం పార్టీలో చేరినట్టుగా ప్రకటించుకుంటున్నారని , ఎద్దేవా చేశారు చంద్రమోహన్ రెడ్డి ప్రకటించుకోవాల్సింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినట్టు కాదు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించి, వద్దు అని చెప్పి, తరిమివేసినటువంటి వాళ్ళకి మేము ఆశ్రయం కల్పిస్తున్నాం, మా దగ్గర ఎవరు చేరడం లేదు కాబట్టి మాకు వాళ్లే గతి అని చెప్తే బాగుంటుందని, కాకాణి స్పష్టం చేశారు ఎవరైతే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేశారో, గెలిచిన తర్వాత పునరాలోచన చేసి,మరలా మనం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు అందరూ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావడం సంతోషకరమన్నారు పార్టీలో చేరినటువంటి వాళ్లలో యువత,మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే వాళ్లు కొంతమంది ఉండడం,మా మొట్టమొదటి ఓటు జగనన్నకు వేస్తామని చెప్పి, ముందుకు రావడం శుభ పరిణామం అన్నారు కీలకమైనటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి రోజువారీ వలసలు వల్ల తెలుగుదేశం పార్టీ కుదేలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడిందని తెలిపారు సోమిరెడ్డి అవినీతి, అరాచకాల వల్లే, సొంత పార్టీ నేతలు వైఎస్ఆర్ సీపీ లో చేరుతున్నారని, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సొంత నాయకులే ఈరోజు స్పష్టంగా బయట మాట్లాడుతున్నారని విమర్శించారు సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వల్ల సర్వనాశనం అయిపోయిందని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా రోజురోజుకూ బలపడుతుందన్నారు అధికారాన్ని వదులుకుని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు రావడం, ప్రధాన నాయకులు, యువకులు వైఎస్ఆర్ సీపీ లో చేరడం సంతోషకరమన్నారు స్థానిక నాయకులు అందరూ కలిసి కృషి చేసి, టిడిపిలో ఉన్న యువకులను, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చడం జరిగిందని ,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నానని , జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ, రాబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరలా తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని,పార్టీలో ప్రతి ఒక్కరికి సమచిత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు పార్టీలో చేరేందుకు కృషి చేసిన స్థానిక వైఎస్ఆర్ సీపీ నాయకులకు కాకాణి కృతజ్ఞతలు తెలియజేశారు