BREAKING
మెట్టుపాళయం–ఊటీ రోడ్డులో కొండచరియలు: ప్రభుత్వ బస్సు చిక్కుకుపోవడంతో రాకపోకలు బంద్! పాట్నాలో ప్రతిపక్షాల ర్యాలీ వాయిదా డిమాండ్: వ్యాపారులకు బీజేపీ మద్దతు విద్యారంగ సమస్యల పరిష్కారంకై పోరాటం తప్ప మరో మార్గం లేదు -- పిడిఎస్ఓ ఏలూరు జిల్లా మహాసభలలో వక్తల ఉద్ఘాటన తిరుపతిలో వైసిపికి బిగ్ షాక్ -వలసలతో టీడీపీకి మరింత బలోపేతం జేబీ సైన్యంలోకి వైసీపీకి చెందిన 150 మంది చేరిక తీర్థ దర్శన్ బస్సులు సురక్షితం కావు: పంజాబ్ ప్రభుత్వంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు! అఫిలియేషన్ 5 సం లకు ఒకసారి ఇవ్వాలి వైసీపీ అభ్యర్థుల విజయం కోరుతూ ముదునూరి ప్రచారం మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సర్పంచ్ నాగరాజు యాదవ్ గోవాడ శివాలయం వద్ద రోడ్డు ప్రమాదం రెండు నామినేషన్లు తిరస్కరణ. పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం ఉజ్బెకిస్తాన్ ఉన్నతాధికారితో విదేశాంగ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ భేటీ: బంగాళాఖాతంలో తుఫాన్ ముప్పు - అప్రమత్తంగా ఉండాలన్న బి. బ్రహ్మ రెడ్డి ఘనపూర్‌లో భూ భారతి భూ సర్వేపై అవగాహన సదస్సు కుందుర్పి లో స్థానిక ఎన్నికల ఎంపిటిసి,జడ్పిటిసి లకు 113 మంది ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు నలుగురు నామినేషన్ వేశారు.

*సర్పంచ్‌ పై కాంగ్రెస్ నాయకుల దాడి.. ప్రజాస్వామ్యం పై దౌర్జన్యమా జిఎంఆర్*

Select Suryaa Now
*సర్పంచ్‌ పై కాంగ్రెస్ నాయకుల దాడి.. ప్రజాస్వామ్యం పై దౌర్జన్యమా జిఎంఆర్*

నారాయణఖేడ్;నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలంలోని సంగెం గ్రామ బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్‌పై ఆయన భార్యతో పాటు కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడి ఘటన తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది.ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యానికే మచ్చగా అభివర్ణించేలా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలల్లో చేస్తున్న దుశ్చర్యలు నేడు ప్రతి చోట చూస్తూనే ఉన్నాం.అధికారంలో ఉన్నామనే అహంకారంతో దౌర్జన్యాలకు పాల్పడితే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు.మునుముందు ఇటువంటి చర్యలు పునరావృతం ఐతే సహించేది లేదని ప్రతిచర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పిన బిఆర్ఎస్ నాయకులు జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మెన్ గుర్రపు మచ్చేందర్ ఈ కార్యక్రమంలో వారి వెంట ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు