రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎంపీకి వినతిపత్రం
తూప్రాన్: మొండిచింత నుండి నాచారం, మాచన్ పల్లి ద్వారా తూప్రాన్ వరకు బీటి రోడ్డు వేయాలని కోరుతూ శనివారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు ను కలిసి బిజెపి దళిత మోర్చా జిల్లా మాజి కార్యదరి డాక్టర్ నర్సిగల్ల నరేష్, కోనయిపల్లి సర్పంచ్ పాండు లు వినతిపత్రం అందజేశారు. మొండిచింత నుండి నాచారం, మాచన్ పల్లి ద్వారా తూప్రాన్ వరకు బీటి రోడ్డు సౌకర్యం కల్పిస్తే ఆయా గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం లో బిజెపి దళిత మోర్చా జిల్లా మాజి కార్యదరి డాక్టర్ నర్సిగల్ల నరేష్, కోనయిపల్లి సర్పంచ్ పాండు, ఎలాబోయిన కర్ణాకర్, నర్సిగల్ల నితిన్ తదితరులు పాల్గొన్నారు.