40వ డివిజన్‌లో కోటంరెడ్డి లక్ష్మి హైందవి ఎన్నికల ప్రచారం
నెల్లూరు, మేజర్ న్యూస్ : నగరంలోని 40వ డివిజన్ పరిధిలోని శ్రీలంక కాలనీ, కావేరి నగర్, రామకోటయ్య నగర్, విజయలక్ష్మి నగర్ ప్రాంతాల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పెద్ద కుమార్తె కోటంరెడ్డి లక్ష్మి హైందవి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి స్థానిక ప్రజలను కలుసుకుని కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర మేయర్ కూటమి అభ్యర్థి పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోటంరెడ్డి లక్ష్మి హైందవి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కూటమి అభ్యర్థులకు ప్రజలు తమ మద్దతు అందించి విజయానికి సహకరించాలని కోరారు. ప్రచారంలో భాగంగా స్థానికులతో ఆమె మమేకమై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.