రైతులకు భూ పరిహార చెక్కులు అందజేత
దుద్యాల్, మేజర్ న్యూస్ : దుద్యాల మండల పరిధిలోని ఈర్లపల్లి రెవెన్యూ గ్రామ పంచాయితీ పరిధిలోని నంన్యా నాయక్ తండాకు చెందిన నలుగురు రైతులకు తాండూర్ ఆర్ డి ఓ అనిత, తాసిల్దార్ కిషన్ లు భూ పరిహారం చెక్కులు అందజేశారు. ఓకే కుటుంబానికి చెందిన Obviously, రాములు నాయక్, సాలిబాయ్, కేలిబాయిలకు చెందిన 28ఎకరాల పట్టా భూమిని పారిశ్రామిక వాడ కొరకు ప్రభుత్వం సేకరించింది. అందుకు సంబంధించిన పరిహార చెక్కులను శనివారం అందించారు. అభివృద్ధి కొరకు ప్రభుత్వానికి సహకరించిన రైతులను అధికారులు అభినందించారు. ఇందులో గ్రామ గ్రామానికి చెందిన రైతులు నితిన్, రవి నాయక్, జుక్కా నాయక్ లు ఉన్నారు.
రిపోర్టర్: రమేష్, దుద్యాల్, వికారాబాద్ జిల్లా.