6 వార్డులో వైసీపీ నాయకుల ప్రచారం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు పట్టణంలోని 6వవార్డులో శుక్రవారం వైసీపీ నాయకులు ప్రచారం నిర్వహించారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ కాజా మస్తాన్ తరుపున ప్రచారంలో పాల్గొన్న సయ్యద్ జమీర్ భాష. ఈ ప్రచారంలో ప్రతి ఇంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తధ్యమని ప్రతి ఒక్కరూ ఘంటాపదంగా తెలియపరుస్తున్నారు అన్ని వార్డుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా చైర్పర్సన్ అభ్యర్థి అల్లారెడ్డి ఇందుమతి గెలవడం తధ్యమని ప్రజలందరూ చెబుతున్నారని జమీర్ బాషా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పుల్లయ్య, షాహీదా, ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు.