BREAKING
కన్నీళ్లు పెట్టుకున్న మిస్టర్ పర్ఫెక్ట్.. కెరీర్ కష్టాలపై అమీర్ ఖాన్ భావోద్వేగం! ఎల్.కోటలో ముగిసిన నామినేషన్ల పర్వం.. మొత్తం 81 నామినేషన్లు 1న ఢిల్లీలో 10 వేల మందితో భారీ నిరసన: స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ నవంబర్‌ 1న నిర్వహణ డిండి ప్రాజెక్టు పేరుతో నల్గొండ కు నీరు తరలించే కుట్ర పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పోలీసులకు వ్యాసరచన పోటీలు జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఇంటింటా ప్రచారం యాదగిరిగుట్ట దేవస్థానంలో దళిత వర్గాల ఉద్యోగులకు ప్రమోషన్ లు తక్షణమే ఇవ్వాలి ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా స్త్రీనిధి రుణాల రీపేమెంట్‌లో బాబురాజుకు రాష్ట్రస్థాయి ప్రథమ స్థానం…కరీంనగర్ జిల్లాకు ద్వితీయ స్థానం ధర్మవరం రూరల్ సీఐపై కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆరోపణలు నిరాధారమే: పోలీసుల స్పష్టీకరణ గ్రామ గ్రామాన అభివృద్ధి.. గడపగడపకు సంక్షేమం స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం: మంత్రి నిమ్మల రామానాయుడు నెల్లిమర్ల జెడ్పీటీసీ స్థానానికి నలుగురు నామినేషన్లు దాఖలు మాగనూర్ నూతన ఎస్సైగా మహేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ నగరాభివృద్ధి ఘనత టిడిపిదే -స్థానిక ఎన్నికలను అడ్డుకునే కుట్ర వైసిపిదే -రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్

సరాక యజమాని నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం

Select Suryaa Now
సరాక యజమాని నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం

 

 

 

 

 జిన్నారం:జిన్నారం మండలంలోని గడ్డపోతారం మున్సిపల్ లో గల సరాక లేబరేటిస్ పరిశ్రమలో రాత్రి ప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులు మృతి చెందారు, అలాగే 6 మంది కార్మికుల వరకు గాయపడినారు.ఈ ఘటన తెలిసిన వెంటనే పరిశ్రమను సందర్శించి నిరసన వ్యక్తం చేసి ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే.రాజయ్య  మాట్లాడుతూ పరిశ్రమ యజమాని నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని, వెంటనే యజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకకపోతే కార్మికుల న్యాయం జరగకపోతే పరిశ్రమ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు .అనుభవం లేని కార్మికులతో పని చేయించడం, పనిచేసే చోట సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నిఘా లేకపోవడం వలన ప్రమాదం జరిగిందని ఆయన అన్నారు.యజమానికి లాభాలు తప్ప కార్మికుల రక్షణ పట్టడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనేక పరిశ్రమలలో ప్రమాదలు జరుగుతున్న ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం ఫలితంగానే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు, యజమానుల పైన కఠిన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ప్రమాదాలు ఆగుతాయని ఆయన అన్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే  జోక్యం చేసుకొని యజమాని తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు .
  ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు భాస్కర్ రెడ్డి,  నాయకులు శేఖర్, రామకృష్ణ, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు..