BREAKING
సోమాజిగూడ హెడ్ క్వార్టర్స్ బార్‌లో రివాల్వర్‌తో హల్‌చల్‌.. కస్టమర్లు, బౌన్సర్లకు బెదిరింపులు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కల సాకారం చేస్తాం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి: రవికుమార్ యాదవ్,శ్రీనివాస్ రెడ్డి ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యతను తెలుసుకోవాలి: డాక్టర్ వెంకటరమణ నేరస్థుడిపై మరోసారి పీడీ యాక్ట్‌.. చర్లపల్లి జైలుకు తరలింపు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి ఎమ్మెల్యే గాంధీ,మాజీ కార్పొరేటర్లు దసరా శుభాకాంక్షలు భూ రికార్డులపై రైతులకు అవగాహన అవసరం : తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ మాదాపూర్‌ సున్నం చెరువులో అక్రమ నీటి దందాపై హైడ్రా ఉక్కుపాదం....అక్రమ బోర్లను ద్వంసం చేసిన హైడ్రా అమెరి కిడ్స్‌ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. లలిత కపిలవాయి ‘కళాప్రయాణం’ చిత్రకళా ప్రదర్శన - హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం కుక్క అడ్డురావడంతో స్కూటీపై నుంచి పడి మృతి ప్రతి నీటి బొట్టు ను ఒడిసి పట్టాలి -వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద చివరి రెండు రోజులు సందడిగా మారిన ‘షీ-2026’ చేనేత వస్త్ర ప్రదర్శన చేనేత చీరల కొనుగోలుకు ఆసక్తి చూపిన వస్త్రాభిమానులు ఆధ్యాత్మిక ప్రచారుకులకు ఘన సత్కారం హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ నేతలు

గ్రామ గ్రామాన అభివృద్ధి.. గడపగడపకు సంక్షేమం స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం: మంత్రి నిమ్మల రామానాయుడు

Select Suryaa Now
గ్రామ గ్రామాన అభివృద్ధి.. గడపగడపకు సంక్షేమం  స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం: మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు, మేజర్ న్యూస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో పాలకొల్లు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకువెళ్లాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కూటమి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఐకమత్యంతో పనిచేయాలని సూచించారు.పాలకొల్లులోని తన కార్యాలయంలో కూటమి ముఖ్య నాయకులు, శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ సుమారు రూ.1,200 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో సిమెంట్ రహదారులు, సిమెంట్ డ్రైన్లు, రైతులకు ఉపయోగపడే పుంత రహదారులు, మంచినీటి పథకాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినట్లు వివరించారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ గ్రామాల అభివృద్ధిని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే పూర్తయిన పనులతో పాటు భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించాలని నాయకులకు సూచించారు.గ్రామాలవారీగా జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందిన సంక్షేమ ప్రయోజనాలపై కూటమి నాయకులు, కార్యకర్తలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి అందుబాటులో ఉండాలని, అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమమే కూటమి అభ్యర్థులకు ప్రధాన బలమని మంత్రి పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టేలా కూటమిలోని అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పాలకొల్లు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజల భాగస్వామ్యం కీలకమని, రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు.