నెల్లిమర్ల జెడ్పీటీసీ స్థానానికి నలుగురు నామినేషన్లు దాఖలు
నెల్లిమర్ల, సూర్య : నెల్లిమర్ల జెడ్పీటీసీ స్థానానికి వైసిపి అభ్యర్థిగా మత్స విజయ, టిడిపి అభ్యర్థిగా గురాన చక్రీధర్ శుక్రవారం జిల్లాపరిషత్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. కాగా కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి నెల్లిమర్ల జెడ్పీటీసీ స్థానానికి యడ్ల గోవిందరావు, రెబల్ అభ్యర్థిగా పతివాడ అచ్చింనాయుడు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో మొత్తంగా నెల్లిమర్ల జెడ్పీటీసీ స్థానానికి నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 27 ఉపసంహరణతో బరిలో ఎవరుంటారో తేలనుంది. వైసిపి జెడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమం లో ఎమ్మెల్సీ సురేష్ బాబు, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, లక్ష్మి మత్స సత్యనారాయణ పాల్గొన్నారు.
రిపోర్టర్ : రాజారావు, నెల్లిమార్ల, విజయనగరం జిల్లా.