BREAKING
తాగునీటి సమస్యపై బీజేపీ పోరుబాట: జలమండలి అధికారులకు వినతిపత్రం అందజేత.. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ నేతల డిమాండ్! కాపులంతా ఎన్డీఏ కూటమి వైపే మంత్రాలయం హుండీ ఆదాయం రూ.3.46 కోట్లు మూతపడిన ఇండోర్ స్టేడియాన్ని వెంటనే తెరిపించాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్‌కు బీఆర్‌ఎస్ నాయకుల వినతి శ్రీకాళహస్తి ప్రాంతంలో ప్రశాంతంగా స్థానిక సంస్థలు ఎన్నికలు నామినేషన్లు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మణికంఠ మైన్స్‌లో మృత్యుఘోష.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల దుర్మరణం సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక బందోబస్తు రేపు రాష్ట్ర మంత్రి ఆత్మకూరు రాక..! పుస్తక జ్ఞానంతో పాటు క్షేత్రస్థాయి అనుభవానికి ప్రాధాన్యం ఓటర్లను బెదిరిస్తే కఠిన చర్యలు: 8 జిల్లాల్లో 14 ఘటనలు నమోదు.. డీజీపీ స్పష్టం భూసారాన్ని కాపాడితేనే వ్యవసాయం లాభసాటి: ఏఓ రామకృష్ణారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సమీక్ష: ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని పిలుపు బ్రహ్మసముద్రం మండలంలో భార్యాభర్తలు ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులుగా నామినేషన్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు సమావేశానికి నాయకులు హాజరు కావాలి శ్రీకాళహస్తి స్థానిక సంస్థలు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలు అక్రమాలు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి

ఒక్క అవకాశం ఇవ్వండి.... నగర ప్రజలు గర్వించే విధంగా నగరాన్ని అభివృద్ధి పరుస్తాను

Select Suryaa Now
ఒక్క అవకాశం ఇవ్వండి.... నగర ప్రజలు గర్వించే విధంగా నగరాన్ని అభివృద్ధి పరుస్తాను

విజయనగరం, సూర్య : ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సిపి విజయనగరం మేయర్ అభ్యర్థిని కోలగట్ల శ్రావణి శుక్రవారం నాడు 57, 27, 28, 35 వార్డుల్లో వైఎస్ఆర్సిపి కార్పొరేట్ అభ్యర్థులతో కలసి పర్యటించారు. పర్యటనలో ఎన్నడూ లేని విధంగా ఆమెకు ఘన స్వాగతం పలుకుతూ నుదుటున తిలకం దిద్ది, హారతి పట్టి ఆశీర్వదించారు. తండ్రి మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి  అడుగుజాడల్లో నడుస్తూ గత 10 ఏళ్లుగా రాజకీయ జీవితంలో ఉన్నానని, విజయనగర ప్రజలతో ఆమెకు పరిచయాలు ఉన్నాయని, గతంలో డిప్యూటీ మేయర్ గా చేసిన అనుభవం కలిగి ఉన్నానని ఆమె అన్నారు. ఇప్పుడు తొలిసారిగా మేయర్ గా పోటీ చేస్తున్నానని, నగర ప్రజలందరూ ఆదరించాలని అభ్యర్థించారు. తాను గెలిస్తే  నగర సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానని, రోడ్లు, ప్రధాన కూడళ్లలో అభివృద్ధి, పాఠశాలలు, పార్కులు అభివృద్ధికి తోడ్పడుతానని ఆమె అన్నారు. తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి తనకు మేయర్ గా ఒక అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేట్ అభ్యర్థులు తాళ్లపూడి వెంకటలక్ష్మి, సిరికి స్వాతి, కాళ్ళకూరి సంతోషి, కొండేటి ప్రకాష్ లతోపాటు వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రిపోర్టర్ :  డేవిడ్ రాజు, విజయనగరం.