మార్టూరులో ఎంపీటీసీ నామినేషన్ల సందడి.. 52 మంది అభ్యర్థుల నామినేషన్లు!
మార్టూరు, మేజర్ న్యూస్:
మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగింది. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
మండలంలో మొత్తం 52 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తరఫున 17 మంది, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) తరఫున 28 మంది, జనసేన పార్టీ (జేఎస్పీ) తరఫున 5 మంది, స్వతంత్ర అభ్యర్థులుగా ఇద్దరు నామినేషన్లు సమర్పించారు.
ఇదిలా ఉండగా, మార్టూరు రామనగర్‌కు చెందిన నాగండ్ల సుభాష్ చంద్రబోస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
నామినేషన్ల ప్రక్రియతో మండలంలో ఎన్నికల సందడి నెలకొనగా, రాబోయే ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది.