జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఇంటింటా ప్రచారం
జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్,జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 3, 4 వార్డుల్లో శుక్రవారం మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జెట్టి గురునాథరావు నాయకత్వంలో మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి మేక సత్యవతి, 3వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గోపిశెట్టి రాధా, 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బండారు లక్ష్మణరావు ప్రచారంలో పాల్గొన్నారు.
నాలుగో వార్డులోని వినాయకుడి గుడి పరిసరాలతో పాటు, మూడో వార్డులోని కేశనపల్లి వారి వీధి, పాత ప్రభుత్వ ఆసుపత్రి వీధి, గాంధీ బొమ్మ సెంటర్, కొంచాడ వారి వీధి, గంగిరెట్ల చెరువు తదితర ప్రాంతాల్లో పర్యటించి ఓటర్లను కలిశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బీవీఆర్ చౌదరి, కర్పూరం గవరయ్య గుప్తా, జెట్టి సత్య ఆదిత్య, ముప్పిడి శ్రీనివాసరావు, కుక్కల ధర్మరాజు, సీమకుర్తి శ్రీనివాసరావు, కేమిశెట్టి మల్లిబాబు, మేక సింహాద్రి, బురుసు ప్రసాద్, గోపిశెట్టి ప్రసాద్, గుర్తు శివ, గుర్తు కార్తీక్, చరణ్ రెడ్డి, డాక్టర్ హనుమంతు, మేక బాలు, గోపి, పెప్సీ శీను, కోనపాము వెంకట్, అబ్బాస్, షరీఫ్, రఫీ, కొలుకులూరి సత్యనారాయణ, కంచుమర్తి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.