ఎల్.కోటలో ముగిసిన నామినేషన్ల పర్వం.. మొత్తం 81 నామినేషన్లు
లక్కవరపుకోట, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో లక్కవరపుకోట మండలంలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు ఒక్కరోజే 33 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మూడు రోజుల్లో మండలంలో మొత్తం 81 నామినేషన్లు నమోదయ్యాయి. పార్టీల వారీగా నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి 37, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 33, జనసేన పార్టీ నుంచి 4, బీజేపీ నుంచి 3, బీఎస్పీ నుంచి 1, స్వతంత్ర అభ్యర్థులుగా 3 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా టీడీపీ నుంచి అత్యధికంగా 37 నామినేషన్లు దాఖలు కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 33 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో తదుపరి ఎన్నికల ఘట్టాలపై రాజకీయ పార్టీలు, అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత రానుంది.
రిపోర్టర్ : గోవింద్, ఎల్ కోట, విజయనగరం జిల్లా.