మహాఅన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ జిల్లా అధ్యక్షులు కె. కె రాజు
సీతమ్మధార, సూర్య : దేవి శరన్నవరాత్రి లో భాగంగా ఉత్తర నియోజకవర్గం 49 వవార్డు అక్కయ్య పాలెం ఎన్ జి జి ఓ ఎస్ కాలనీ లో హిందూ ముస్లిం క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ శ్రీ దుర్గామాతను దర్శనం చేసుకుని అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మహా అన్నదానం వైసిపి జిల్లా అధ్యక్షులు కేకే రాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 49 వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థిని బొడ్డేటి మాధవి, వార్డు అధ్యక్షుడు బొడ్డేటి కిరణ్ కుమార్, నాయకులు భోగవల్లి గోవింద్, కమిటీ సభ్యలు పార్ధ సారధి తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.