ప్రచారంలో మొల్లి హేమంత్ కు బ్రహ్మరథం
ఆరిలోవ, సూర్య : జీవీఎంసీ, 15 వ వార్డు వైసిపి అభ్యర్థి మొల్లి హేమంత్ కు శుక్రవారం ప్రచారంలో స్థానిక వార్డు ప్రజలు హారతులు, పువ్వుల దండలు తో అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. వార్డు పరిధిలోని టీ ఐ సి పాయింట్ , ఎస్టి కాలనీ ప్రచారాన్ని నిర్వహించారు. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు గోలగాని శ్రీనివాస్, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ సెక్రటరీ మందారెడ్డి, వార్డు పరిశీలకులు కమల్ యాదవ్, కన్నేటి సుబ్బారెడ్డి, వార్డు మహిళా అధ్యక్షరాలు సుజాత బూత్ కన్వీనర్లు నాగచైతన్య, పీతల రాము, పీతల చందు, సత్య పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. పరిశీలకులు కమల్ యాదవ్, కన్నేటి సుబ్బారెడ్డి, వార్డు మహిళా అధ్యక్షరాలు సుజాత బూత్ కన్వీనర్లు నాగచైతన్య, పీతల రాము, పీతల చందు, సత్య పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్ : శ్రీనివాస్, అరిలోవా, విశాఖపట్నం.