అయిజలో ఘనంగా ఏసీసీ సిమెంట్ షాపు 25వ వార్షికోత్సవ వేడుకలు*
నమ్మకానికి, కస్టమర్ల ఆదరణకు ప్రతీకగా రెండు దశాబ్దాలకు పైగా వ్యాపార ప్రస్థానం కొనసాగించడం అభినందనీయమన్న వక్తలు
ఐజమున్సిపాలిటీ కేంద్రంలో ఏసీసీ సిమెంట్స్ అధినేత రవి ప్రకాష్ రెడ్డి షాపు ప్రారంభమై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం రజతోత్సవ వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాస్టర్ షేక్షావల్లి ఆచారి మరియు సింగిల్ విండో చైర్మన్ పోతుల మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి రవి ప్రకాష్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ప్రజల నమ్మకాన్ని చూరగొంటూ, కస్టమర్ల ఆదరణతో వ్యాపార రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఇదే స్పూర్తితో రాబోయే రోజుల్లో వ్యాపారాన్ని మరింత విస్తరించి, మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ విజయవంతమైన ప్రస్థానం మరెన్నో విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చిన్నికృష్ణ, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు డాన్ వీరన్న, 14వ వార్డు ఇంచార్జ్ మేస్త్రి శీను, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు మాల మల్లికార్జున్, మాజీ కౌన్సిలర్ బోయ లక్ష్మన్న, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అడ్వకేట్ కురువ వీరేష్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
సూర్య రిపోర్టర్ వి అనందరాజ్ ఐజ మండలం