BREAKING
ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ పరీక్షలు దర్శి నియోజకవర్గంలోప్రశాంతంగా ముగిసిన నామినేషన్ లు. అందోల్ నియోజకవర్గ లో అలై బలై కార్యక్రమం మంత్రి దామోదర్ రాజనర్సింహం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మారెడ్డి రాజశేఖర్ రెడ్డి! నార్పల జడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన సీనియర్ నాయకుడు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ నామినేషన్ దాఖలు లక్కీ డ్రా నిర్వాహకుల అరెస్ట్ అలాస్కా సెనేట్ ఎన్నికల ఫలితాలపై ట్రంప్ యంత్రాంగం న్యాయపోరాటం ఫుట్ పాత్ లు మాయం.. రోడ్లపైకి వస్తున్న కమర్షియల్ షట్టర్లు.. హడావిడి పనులే కొంపముంచేయ భారత్ పెట్రోలియం లాభాల్లో క్షీణత...ముడి చొట్ల ధరల ఒడుదొడుకులే కారణం కోటపాటి వైపు టీడీపీ అధిష్ఠానం చూపు మిసెస్ యూనిటీ వరల్డ్ ఆశా దీపిక అట్టలూరికి ఘన స్వాగతం హింసతో ఎన్నికల ప్రక్రియను శాసిస్తే సహించేది లేదు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో, సురభి కళాక్షేత్రం లో అలరించిన బాల కళాకారులు చంద్రశేఖరపురం జడ్పీటీసీ బరిలో కోటపాటి జనార్దనరావు

అంగడి చౌరస్తాలో అలుముకున్న చీకట్లు.. ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?

Select Suryaa Now
అంగడి చౌరస్తాలో అలుముకున్న చీకట్లు.. ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?

 

శామీర్‌పేట, మేజర్ న్యూస్ : మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అంగడి చౌరస్తా రాత్రివేళల్లో వీధి దీపాలు వెలగక చీకటిమయంగా మారుతోంది. నిత్యం వాహనాలు, ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ ప్రధాన కూడలిలో కనీస వెలుతురు లేకపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీకట్లో రాకపోకలు సాగించాల్సి రావడంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రధాన కూడలిలోనే వీధి దీపాలు వెలగకపోవడంపై సంబంధిత అధికారుల నిర్లక్ష్యమే కారణమా? ప్రజలు ఇబ్బందులు పడుతున్నా సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఇప్పటికైనా మూడు చింతలపల్లి మున్సిపల్ అధికారులు స్పందించి అంగడి చౌరస్తాలో వీధి దీపాలు వెలిగేలా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. వెలగని దీపాలకు మరమ్మతులు చేపట్టి, రాత్రివేళల్లో చౌరస్తా అంతటా తగిన వెలుతురు ఉండేలా చూడాలని కోరుతున్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.