BREAKING
డిండి ప్రాజెక్టు పేరుతో నల్గొండ కు నీరు తరలించే కుట్ర పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పోలీసులకు వ్యాసరచన పోటీలు జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఇంటింటా ప్రచారం యాదగిరిగుట్ట దేవస్థానంలో దళిత వర్గాల ఉద్యోగులకు ప్రమోషన్ లు తక్షణమే ఇవ్వాలి ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా స్త్రీనిధి రుణాల రీపేమెంట్‌లో బాబురాజుకు రాష్ట్రస్థాయి ప్రథమ స్థానం…కరీంనగర్ జిల్లాకు ద్వితీయ స్థానం ధర్మవరం రూరల్ సీఐపై కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆరోపణలు నిరాధారమే: పోలీసుల స్పష్టీకరణ గ్రామ గ్రామాన అభివృద్ధి.. గడపగడపకు సంక్షేమం స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం: మంత్రి నిమ్మల రామానాయుడు నెల్లిమర్ల జెడ్పీటీసీ స్థానానికి నలుగురు నామినేషన్లు దాఖలు మాగనూర్ నూతన ఎస్సైగా మహేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ నగరాభివృద్ధి ఘనత టిడిపిదే -స్థానిక ఎన్నికలను అడ్డుకునే కుట్ర వైసిపిదే -రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ నేను హీరోయిన్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు.. ఇడుపు కాయితం వేడుకలో నాగదుర్గ భావోద్వేగం! ముగిసిన నామినేషన్ల పర్వం వైసీపీ విజయానికి సమష్టిగా కృషి చేయాలి నీరజ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం.. పార్టీ శ్రేణులకు అనంత వెంకటరామిరెడ్డి పిలుపు మేయర్ అభ్యర్థి సి. రమేష్‌తో పాటు కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని నేతల సూచన ప్రశాంతంగా ముగిసిన ఎంపీటీసీ, ఎన్నికల నామినేషన్లు

నామినేషన్ కేంద్రం వద్ద తోపులాట

Select Suryaa Now
నామినేషన్ కేంద్రం వద్ద తోపులాట

పూసపాటిరేగ, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసేందుకు వచ్చిన అభ్యర్థులను అదుపు చేయడంలో చేయడంలో పోలీసులు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఉదయం పూట నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగినప్పటికీ మధ్యాహ్నం నామినేషన్లు వేసేందుకు పెద్ద ఎత్తున అభ్యర్థులతో పాటు వారు అనుచరులు రావడంతో నామ పత్రాల కేంద్రం వద్ద అభ్యర్థులు బారులు తీరారు. అభ్యర్థులతో పాటు వారి అనుచర గణాన్ని పోలీసులు నామ పత్రాల కేంద్రం వద్దకు వచ్చి నియంత్రించడం ఇబ్బందికరంగా మారింది. ఎన్నికల ఇబ్బంది టోకెన్ విధానం ఏర్పాటు చేసినప్పటికీ గంపగుత్తగా నామ పత్రాల కేంద్ర వద్దకు చేరుకోవడం ఎన్నికల అధికారికి నాం పత్రాలను సమర్పించేందుకు వెళ్లి వచ్చేవారికి కాస్త ఇబ్బందికరంగా మారడంతో ఎన్నికల అధికారి గోపి కూడా అసహనం వ్యక్తం చేశారు. పరిస్థితి శృతిమించడంతో మండల పరిపాలన అధికారి వైయస్సార్ నాయుడు కు చెప్పడం తర్వాత పోలీసులు జోక్యం చేసుకొని నాం పత్రాలను వరుస క్రమంలో పెట్టి ఒకరి తర్వాత ఒకరిని పంపించడంతో నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగినట్లు అయింది. తర్వాత పరిస్థితి అదుపులోకి రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

రిపోర్టర్ : రమేష్, పూసపాటిరేగ, విజయనగరం జిల్లా.