BREAKING
దేవరపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా: ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీకాకుళపు కాళీకృష్ణ తల్లిని మించిన ఎత్తులో ఆరాధ్య బచ్చన్.. ఐశ్వర్య రాయ్ లేటెస్ట్ ఫొటోలు వైరల్! రెడ్ కలర్ మోడ్రన్ డ్రెస్‌లో తమన్నా గ్లామర్ విందు.. ట్రెండింగ్‌లో మిల్కీ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు! రక్తదానం మరికొందరికి ప్రాణదానం :మానవత జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో టీ-ఫైబర్ సేవలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ బాణాసంచా దుకాణాలు తనిఖీ చేసిన డిఎస్పి... పటిష్టంగా మున్సిపల్ పోలింగ్,ఓట్ల లెక్కింపు ప్రక్రియఅధికారులకు జిల్లా కలెక్టర్ కెవిత్రి సెల్వి గౌరవప్రదంగా జీవించాలి ---జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ టిడిపి, జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలోకి 20 మంది యువకులు నెల్లూరుపాలెంలో కూటమి ఐక్యత సాధించిన బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ గంజాయి స్వాధీనం.. వ్యక్తి అరెస్టు మర్తిడి లో డ్రగ్స్, గంజాయి సాగు, వినియోగంపై అవగాహన కార్యక్రమం...... చంద్రగిరిలో 142 నామినేషన్ల తిరస్కరణ..! – ఓటమి భయంతోనే అడ్డగోలు తిరస్కరణలంటూ మోహిత్‌రెడ్డి ఆరోపణ త్వరితగతిన బియ్యం సరఫరా చేయాలి

వైసీపీ విజయానికి సమష్టిగా కృషి చేయాలి నీరజ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం.. పార్టీ శ్రేణులకు అనంత వెంకటరామిరెడ్డి పిలుపు మేయర్ అభ్యర్థి సి. రమేష్‌తో పాటు కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని నేతల సూచన

Select Suryaa Now
వైసీపీ విజయానికి సమష్టిగా కృషి చేయాలి  నీరజ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం.. పార్టీ శ్రేణులకు అనంత వెంకటరామిరెడ్డి పిలుపు  మేయర్ అభ్యర్థి సి. రమేష్‌తో పాటు కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని నేతల సూచన

అనంతపురం బ్యూరో, ( అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్) : అనంతపురం నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ లీగల్ విభాగం నాయకురాలు నీరజ ఆధ్వర్యంలో ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి పార్టీ ముఖ్య నాయకులు, న్యాయ విభాగం ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో అనంత వెంకటరామిరెడ్డి, వైసీపీ మేయర్ అభ్యర్థి సి. రమేష్, అహుడా మాజీ చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకుడు మీసాల రంగన్న, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ కాగజ్‌గర్ రిజ్వాన్, రాయలసీమ బలిజ సంఘం గౌరవ అధ్యక్షుడు బళ్లారి వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. లీగల్ సెల్ నాయకులు, పార్టీ ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొని ఎన్నికల వ్యూహాలు, పార్టీ విజయావకాశాలపై చర్చించారు.

గత ప్రభుత్వ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రస్తుత పాలనలో జరుగుతున్న పరిణామాలను కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టాలని పేర్కొన్నారు.

మేయర్, కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపే లక్ష్యం

అనంతపురం నగర మేయర్ అభ్యర్థి సి. రమేష్‌తో పాటు వివిధ డివిజన్లలో పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు కోరారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, ఇతరులతోనూ వేయించి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మీయ సమావేశం ద్వారా పార్టీ నాయకులు, లీగల్ విభాగం ప్రతినిధుల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.