ప్రశాంతంగా ముగిసిన ఎంపీటీసీ, ఎన్నికల నామినేషన్లు
ప్రశాంతంగా ముగిసిన ఎంపీటీసీ, ఎన్నికల నామినేషన్లు
ఎమ్మిగనూరుసూర్య ప్రతినిధి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా 21, 22, 23 తేదీల్లో జరిగిన నామినేషన్ల పర్వం ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టారు.ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి, ఎస్‌ఐ తిమ్మారెడ్డి, ఎమ్మిగనూరు రూరల్ ఎస్ ఐ శ్రీనివాసులు సిబ్బంది విధులు నిర్వహించారు.ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ అంతా ప్రశాంతంగా జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా పూర్తయింది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్నికల పూర్తయ్యే వరకు ఎక్కడైనా కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన ఉపేక్షించమన్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న అనుమానితులను ఇప్పటికే గుర్తించి వారికి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. ఎన్నికల పట్ల ఎవరికైనా ఇబ్బంది ఉంటే తమకు సమాచారం అందించి తగు న్యాయం పొందాలని సూచించారు.
A. రాజ శరత్ కుమార్
సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా