ఆత్రేయపురం టిడిపి ఎంపీపీ అభ్యర్థిగా తోటకూర సుబ్బరాజు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
ఆత్రేయపురం మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ఉచ్చిలి గ్రామానికి చెందిన తోటకూర సుబ్బరాజు ను ఖరారు చేశారు.కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆశీస్సులతో కూటమి తరుపున సుబ్బరాజు అభ్యర్థిత్వం ఖాయం కావడంతో శుక్రవారం ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఎంపిటిసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గతంలో వాడపల్లి దేవస్థానం చైర్మన్ ప్రస్తుతం సొసైటీ అధ్యక్షులుగా ఉండి అందరి మన్ననలు పొందిన తోటకూర సుబ్బరాజు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు ముఖ్య అనుచరుడిగా వ్యవహరిస్తున్నారు. ఉచ్చిలి గ్రామంలో జరిగిన పలు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా విజయఖేతనం ఎగరవేయడంలో ఆయన పాత్ర కీలకం. తోటకూర సుబ్బరాజు ఆత్రేయపురం ఎంపీపీ అధ్యక్షుడిగా ఖాయం కావడంతో ఆత్రేయపురం మండలంలో కూటమి పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. ఉచ్చిలి గ్రామ ఎంపిటిసిగా భారీ విజయంతో తోటకూర సుబ్బరాజు విజయం సాధించడం ఖాయం కావడంతో పాటు ఎంపీపీ అభ్యర్థిగా సుబ్బరాజు పేరు ఖరారు కావడంతో మండల పరిధిలోని అన్ని ఎంపిటిసి స్థానాలను కూటమి పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్థులు భారీ విజయంతో ఎంపిటిసి స్థానాలకు కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది ఈ ర్యాలీలో వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు మండల టిడిపి అధ్యక్షులు కూసం పూడి రామకృష్ణంరాజు పారిశ్రామికవేత్త ముదునూరి వీరబాబు రాజు. ఇందుకూరి శ్రీనివాసరాజు ,జిల్లా ప్రాజెక్టు కమిటీ ఉపాధ్యక్షులు కరుటూరి నరసింహారావు, రాష్ట్ర టి ఎన్ టి యు సి కార్యనిర్వహక కార్యదర్శి ముళ్ళ పూడి భాస్కరరావు, పేర్చేర్ల పుల్లంరాజు వర్మ,మండల తెలుగు యువత అధ్యక్షులు వెచ్చ అనిల్ కుమార్ , మాజీ ఎంపీపీ పిఎస్ రాజు, సొసైటీ అధ్యక్షులు ముదునూరి రాంబద్ర రాజు ,నాగిరెడ్డి సత్యనారాయణ, దాసరి రామాంజనేయులు జల్లికామేశ్వరరావు మద్దూరి సుబ్బారావు ,తోట రజిని చేకూరి కృష్ణంరాజు దాసరి గణేష్ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు