BREAKING
30 మద్యం సీసాలు స్వాధీనం ఐఫా 2027 వేదికపై సల్మాన్ ఖాన్ అల్లరి.. రష్మిక మందన్నాపై సెటైర్లు, వరుణ్ ధావన్‌తో చిలిపి డ్యాన్స్ మండలంలో 109 ఎంపిటిసి నామినేషన్లు బడ్జెట్ లోటు పూడ్చేందుకు ఇటలీలో ఇంధన సంస్థలపై ట్యాక్స్ పెంపునకు కసరత్తు ఏడవ వార్డులో తెదేపా అభ్యర్థి ఎన్నికల ప్రచారం. ప్రమాద రహిత రంగారెడ్డే లక్ష్యం.. రోడ్డు భద్రతకు పటిష్ట చర్యలు 15 ఎంపీటీసీ స్థానాలకు 95 నామినేషన్లు రెడ్ బుక్ రాజ్యాంగానికి నిదర్శనం స్థానిక సంస్థల ఎన్నికలలో దౌర్జన్యాలు* *వైసీపీ అభ్యర్థులను గెలిపించండి* *మాజీ మేయర్ మహమ్మద్ వసీం* మార్టూరులో ఎంపీటీసీ నామినేషన్ల సందడి.. 52 మంది అభ్యర్థుల నామినేషన్లు! కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి జడ్పిటిసిలు నామినేషన్లు. ఒక్క అవకాశం ఇవ్వండి.... నగర ప్రజలు గర్వించే విధంగా నగరాన్ని అభివృద్ధి పరుస్తాను ఏలూరులో జోరందుకున్న కూటమి అభ్యర్థుపలు డివిజన్ లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడుల ప్రచారం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై పోలీసుల జులుం! వాల్‌స్ట్రీట్ నియంత్రణ సంస్థల కీలక నిర్ణయం బండమాదారంలో ఆగని అక్రమ మట్టి దందా.. అధికారుల మౌనం వెనుక మర్మమేంటి..?

*అశ్వారావుపేటలో కొబ్బరి రైతుల అవగాహన సదస్సు*

Select Suryaa Now
*అశ్వారావుపేటలో కొబ్బరి రైతుల అవగాహన సదస్సు*

సూర్య అశ్వరావుపేట అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని కాసాని గార్డెన్స్ నందు బుధవారం కొబ్బరి అభివృద్ధి బోర్డు ఆధ్వర్యంలో కొబ్బరి రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సమావేశంలో కొబ్బరి బోర్డు ద్వారా అందుతున్న సబ్సిడీ పథకాల గురించి రైతులకు వివరించారు. గతంలో కొబ్బరి పంటకు పూర్తి సబ్సిడీపై ఎరువులు పంపిణీ చేయగా, ఇంకా మిగిలి ఉన్న రైతులకు సబ్సిడీ ఎరువుల పంపిణీ నిమిత్తం అప్లికేషన్లు పెట్టుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు.

అలాగే కొత్తగా వేసుకున్న కొబ్బరి మొక్కలకు మొక్కకు రూ. 350 చొప్పున సబ్సిడీ ఇవ్వడం, కొబ్బరి బోర్డులో అందుబాటులో ఉన్న ఇతర సబ్సిడీలు, పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతర్ పంటల సాగుపై కూడా అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో కొబ్బరి బోర్డు అధికారి శరత్,హార్టికల్చర్ అధికారి ఈశ్వర్,రైతు సంఘం నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య,ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు,గంగారం క్లస్టర్ చైర్మన్ చీమకుర్తి వెంకటేశ్వరరావు, అశ్వారావుపేట కష్ట చైర్మన్ కాసాని పద్మశేఖర్,దమ్మపేట ట్రస్ట్ చైర్మన్ మురళి,తాడేపల్లి రవి,కార్పొరేట్ కంపెనీ మేనేజర్లు,పలువురు కొబ్బరి రైతులు పాల్గొన్నారు.

సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట