ఆత్మకూరులో నామినేషన్స్ చివరి రోజు భారీగా పోలీసు బందోబస్తు
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరులో శుక్రవారం ఎంపీటీసీ నామినేషన్ల చివరి రోజు కావడంతో నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు ఆత్మకూరులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్సై జంపాని కుమార్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. అభ్యర్థులు భారీ ర్యాలీలతో రాకూడదని, ముగ్గురు మాత్రమే నామినేషన్ కేంద్రానికి రావాలని సూచించారు. గొడవలకు ప్రేరేపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.