బోడవారిపల్లి ఎంపీటీసీ బరిలో జనసేన అభ్యర్థి చిరంజీవి
దుత్తలూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం బోడవారిపల్లి ఎంపీటీసీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థి చిరంజీవి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో నామినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ దుత్తలూరు మండల మాజీ కన్వీనర్ దుంపలగడ్డ రవికుమార్, మాజీ వైస్ కన్వీనర్ లిఖిత్ పాల్గొన్నారు. బోడవారిపల్లి ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడంతో స్థానికంగా ఎన్నికల సందడి నెలకొంది.