శారదా దేవి మండపాలను దర్శించుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి: అదిలాబాద్ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శ్రీ శారదా దేవి మండపాలను మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ సందర్శించి, శారదా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శారదా దేవి జ్ఞానానికి, విద్యకు, విజ్ఞానానికి ప్రతీక అని పేర్కొన్నారు. శారదా మాత ఆశీస్సులతో విద్యార్థులు విద్యారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అదిలాబాద్ పట్టణం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని, ప్రజల మధ్య సోదరభావం, ఐక్యత, శాంతి వెల్లివిరియాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.