వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత - ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్
సూర్య, కౌటాల:సిర్పూర్ రేంజ్ లోని కౌటాల వద్ద చేపల వేట కోసం అమర్చిన వలలో మూడు తాబేళ్లు చిక్కుకోవడంతో స్థానికులు సిర్పూర్ ఎఫ్.ఆర్.ఓ శ్రీనివాస్ సమాచారం అందించగా ఎఫ్.ఆర్.ఓ సూచన మేరకు బీట్ ఆఫీసర్లు నరేష్, మురళి, అరుణ్, తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వెటర్నరీ డాక్టర్ పరిశీలన తర్వాత సిర్పూర్(టీ) లోని నాగమ్మ చెరువులో సురక్షితంగా విడిచిపెట్టారు. అనంతరం ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ, వన్యప్రాణులకు సంబంధించిన సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేయాలని, వాటిని చంపినట్లయితే చట్టరీత్యా చర్యలు ఉంటాయని అన్నారు. ఎల్-నినో దృష్ట్యా వన్యప్రాణులకు అడవుల్లో తగినంత నీటి సదుపాయం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, అయినప్పటికీ వన్యప్రాణులు దారితప్పి గ్రామాల్లోకి వచ్చినట్లయితే, వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని ఆయన తెలిపారు.