BREAKING
పైడితల్లి అమ్మవారి దయతో ఇంతటి అవకాశం .... * నా పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను * మణుగూరు పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆత్రేయపురం టిడిపి ఎంపీపీ అభ్యర్థిగా తోటకూర సుబ్బరాజు ఖమనలో వర్షవాస్ ముగింపు వేడుకలు ఓటమి భయంతో కూటమి దాడులు అయిజలో ఘనంగా ఏసీసీ సిమెంట్ షాపు 25వ వార్షికోత్సవ వేడుకలు* *అశ్వారావుపేటలో కొబ్బరి రైతుల అవగాహన సదస్సు* భారత్ మహిళల జట్టు ముందు సాధారణ లక్ష్యం.. జింబాబ్వే ఆలౌట్! గజపతినగరంలో జనసేన నామినేషన్లు జెడ్పిటిసి, ఎంపిటిసి నామినేషన్ ప్రక్రియ ప్రశాంతం: జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ నామినేషన్ కేంద్రం వద్ద తోపులాట ఇండియన్ 3 చిత్రానికి దర్శకుడు శంకర్‌కు లైకా ప్రొడక్షన్స్ ఊహించని షాక్.. ఆసక్తికరమైన విషయాలు! ప్రశాంతంగా ముగిసిన నామినేషన్లు ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించిన ఎన్నికల అధికారి టాలీవుడ్‌పై స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తీ ప్రత్యేక దృష్టి.. వరుస స్ట్రెయిట్ సినిమాలతో దూకుడు!

జనసేనలోకి వైసీపీ సీనియర్ నేత బత్తుల మల్లికార్జునరావు

Select Suryaa Now
జనసేనలోకి వైసీపీ సీనియర్ నేత బత్తుల మల్లికార్జునరావు

​కావలి, మేజర్ న్యూస్ :   కావలి నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు బత్తుల మల్లికార్జునరావు శుక్రవారం తన అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. బత్తుల మల్లికార్జునరావు, గండూరి శ్రీనివాసులు తమ అనుచరులతో కలిసి వైసీపీకి రాజీనామా చేసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
​ఈ సందర్భంగా కావలి జనసేన పార్టీ సమన్వయకర్త మన్నెమాల సుకుమార్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ, అందరం కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు శ్రమించాలని కోరారు.
​ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.