క్రికెట్ ఛాంపియన్ వంశీకకు కేటీఆర్ అభినందనలు
సూర్య, ముస్తాబాద్:రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన క్రికెట్ క్రీడాకారిణి గూడెపు వంశీక హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వంశీకను కేటీఆర్ సన్మానించి అభినందించారు. క్రీడల్లో మరింత రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. వంశీకకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. క్రీడల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించి ముస్తాబాద్ మండలంతో పాటు నియోజకవర్గానికి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకురావాలని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో చిప్పలపల్లి మాజీ సర్పంచ్ గాడిచర్ల దేవయ్య, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి, గూడూరు మాజీ సర్పంచ్ వెంకటనర్సింగరావు పాల్గొన్నారు.