BREAKING
కాకాణి సమక్షంలో తెలుగుదేశంని వీడి వైఎస్ఆర్‌సీపీలో చేరిన 50 కుటుంబాలు శ్రీకాళహస్తి డివిజన్ లో నామినేషన్లు తిరస్కరణకు గురైతే అప్పీల్ చేసుకోండి ఆర్డిఓ భాను ప్రకాశ్ రెడ్డి రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎంపీకి వినతిపత్రం పర్చూరు నియోజకవర్గంలో జడ్పీటీసీ స్థానాల్లో విజయకేతనం ఎగురవేయాలి : ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్ని ఎంపీటీసీ నామినేషన్లు ఆమోదం.. * 27 వరకు ఉపసంహరణ గడువు * ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని 26వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జయమ్మ ప్రచారం ఎంఫార్మసీ, బీఫార్మసీ పేమెంట్ సీట్ల స్పాట్ అడ్మిషన్లు విదేశీ పెట్టుబడుల ఆంక్షల పెంపు నిర్ణయాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ 40వ డివిజన్‌లో కోటంరెడ్డి లక్ష్మి హైందవి ఎన్నికల ప్రచారం రైతులకు భూ పరిహార చెక్కులు అందజేత నెల్లూరు రూరల్ ప్రచార పర్వంలో ఎంపీ వేమిరెడ్డి యోగా పోటీలకు ఎంపికైన శ్రీ సత్యసాయి విద్యా విహార్ విద్యార్థులు రష్యాలో ఘోర రోడ్డు ప్రమాదం...రైలు ఢీకొని ఆరుగురు దుర్మరణం సీఎంర్ఫ్ ద్వారా రూ. 1.56 లక్షల ఎల్ఓసీ అందజేత ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబ మెగాన్ మార్కెల్ వివాదంపై స్పష్టత ఇచ్చిన లండన్ పోలీసులు

నర్సరావుపేటలో MPTC, ZPTC ఎన్నికల బహిష్కరణ

Select Suryaa Now
నర్సరావుపేటలో MPTC, ZPTC ఎన్నికల బహిష్కరణ

నరసరావుపేట :పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వైఎస్సార్‌సీపీ బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియకు పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తామని పోలీసులు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. గత మూడు రోజులుగా పోలీసుల భద్రత కోసం వేచి చూసినప్పటికీ నిరాశే ఎదురైందని, చివరకు నామినేషన్ గడువు ముగిసే సమయానికి పోలీసులు కేంద్రాల వద్దకు వచ్చారని తెలిపారు.

రెండు మండలాల్లో నామినేషన్లు వేసేందుకు అనుమతి కోరగా, కేవలం రొంపిచర్ల మండలానికి మాత్రమే అనుమతించారని ఆవేదన వ్యక్తం చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద సుమారు రెండు వేల మంది వరకు టీడీపీ కార్యకర్తలు మోహరించారని పేర్కొన్నారు. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో తమ పార్టీ మహిళా అభ్యర్థుల భద్రతను ప్రమాదంలో పడేయడం ఇష్టం లేకే ఈ ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.