BREAKING
ఎల్.కోటలో ముగిసిన నామినేషన్ల పర్వం.. మొత్తం 81 నామినేషన్లు 1న ఢిల్లీలో 10 వేల మందితో భారీ నిరసన: స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ నవంబర్‌ 1న నిర్వహణ డిండి ప్రాజెక్టు పేరుతో నల్గొండ కు నీరు తరలించే కుట్ర పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పోలీసులకు వ్యాసరచన పోటీలు జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఇంటింటా ప్రచారం యాదగిరిగుట్ట దేవస్థానంలో దళిత వర్గాల ఉద్యోగులకు ప్రమోషన్ లు తక్షణమే ఇవ్వాలి ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా స్త్రీనిధి రుణాల రీపేమెంట్‌లో బాబురాజుకు రాష్ట్రస్థాయి ప్రథమ స్థానం…కరీంనగర్ జిల్లాకు ద్వితీయ స్థానం ధర్మవరం రూరల్ సీఐపై కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆరోపణలు నిరాధారమే: పోలీసుల స్పష్టీకరణ గ్రామ గ్రామాన అభివృద్ధి.. గడపగడపకు సంక్షేమం స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం: మంత్రి నిమ్మల రామానాయుడు నెల్లిమర్ల జెడ్పీటీసీ స్థానానికి నలుగురు నామినేషన్లు దాఖలు మాగనూర్ నూతన ఎస్సైగా మహేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ నగరాభివృద్ధి ఘనత టిడిపిదే -స్థానిక ఎన్నికలను అడ్డుకునే కుట్ర వైసిపిదే -రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ నేను హీరోయిన్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు.. ఇడుపు కాయితం వేడుకలో నాగదుర్గ భావోద్వేగం!

అయ్యప్ప భక్తుల యాత్రకు శ్రీకారం చుట్టిన టీబీజీకేఎస్‌ నేత కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి

Select Suryaa Now
అయ్యప్ప భక్తుల యాత్రకు శ్రీకారం చుట్టిన టీబీజీకేఎస్‌ నేత కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి
సూర్య నస్పూర్‌ :శ్రీరాంపూర్‌ నుంచి శబరిమలకు అయ్యప్ప భక్తులు చేపట్టిన మహా పాదయాత్రను టీబీజీకేఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. శ్రీరాంపూర్‌ కాలనీకి చెందిన బోడ రామకృష్ణ, ఎగ్గడి వినోద్‌కుమార్‌, గాదాసు కళ్యాణ్‌ అయ్యప్ప మాల ధరించి, సుమారు 1,400 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం నుంచి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత అయ్యప్ప ధర్మప్రచార సభ (ఏబీఏపీ) శ్రీరాంపూర్‌ అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్‌, రాష్ట్ర మీడియా ఇన్‌చార్జి భాస్కరి రాజేశం పాల్గొన్నారు. అంతకుముందు ఆలయంలో గురుస్వామి సంగనబట్ల నరహరి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు ఇరుముడి కట్టారు. అనంతరం శ్రీరాంపూర్‌ కాలనీ అయ్యప్ప సేవా సన్నిధానం గురుస్వాములు పాదయాత్ర చేస్తున్న భక్తులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ, భక్తులు పంబా నదికి చేరుకుని, 45వ రోజు శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్నట్లు తెలిపారు. పాదయాత్ర విజయవంతంగా సాగాలని, భక్తులు క్షేమంగా స్వామివారి సన్నిధికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వంగ శివ, సుంకెనపల్లి రాజేందర్‌, సాధు వీరభద్రస్వామి, రామలింగం, రవికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.