telangana
ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలి
సూర్య రెంజల్ : మండలంలోని రైతులందరూ లెనిన్ ప్రభావం ఉండడంతో ఆరుతడి మొగ్గు చూపాలని మండల వ్యవసాయ అధికారి సిద్ధి రామేశ్వర్ సూచించారు. రెంజల్ మండలంలోని దూపల్లి, అంబేద్కర్ నగర్ గ్రామాలలో సర్పంచ్ లు తరూరి నరసవ్వ అబ్బయ్య మరియు వాగ్మారే మాధవ్ అధ్యక్షతన అవగాహన కల్పించారు. ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల వైపు ముగ్గు చూపాలని అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువ శాతం నమోదు కావడంతో రైతులు వరి పంటలు కాకుండా ఆరుతడి పంటలను వైపు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పామాయిల్, మొక్కజొన్న, కంది, పెసరు, మినుము, పల్లి ఇతర పంటల వేసుకోవాలన్నారు. చెరువులో గోదావరిలో నీరు పూర్తి స్థాయిలలో లేకపోవడంతో వరి పంటలు పండేందుకు కష్ట కాలంగా ఉందని, వేసవిలో పశువులకు మరియు ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కాకుండా ముందస్తుగా జాగ్రత్తలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సారంగాపూర్ లో విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.