చిన్నారులను ఆశీర్వదించిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి
సూర్య నిజాంసాగర్ : ఎల్లారెడ్డి మండలంలోని కొక్కొండ గ్రామానికి చెందిన ముత్యం కుమార్తెలు సౌమ్య, స్పందన, సాత్విక ల లంగా ఓణీ వేడుకలు కార్యక్రమం శుక్రవారం వారి స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎల్లారెడ్డి నియోజకవర్గ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి చిన్నారులను ఆశీర్వదించి, వారి భవిష్యత్తు సుఖ,సంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని, ఉండాలని ఆకాంక్షిస్తూ దీవించి చిన్నారులకు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు నాయకులు చెన్నంగారి శ్రీనివాస్ రెడ్డి, హఫీజ్ పటేల్, పరందాములు, జైపాల్ రెడ్డి, సంతోష్ పాటిల్, హఫీజ్ పటేల్, ధనవత్ రాజు, నీల రవి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.