పట్టభద్రుల ఓటు నమోదుపై గులాబీ దళం ఫోకస్*
*-రాకేష్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి*
*-ఆలేరుమాజీ ఎమ్మెల్యే గొంగిడి పిలుపు*
రాజపేట, మేజర్ న్యూస్:పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి రాకేష్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా శ్రేణులు సమష్టిగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాజాపేట మండల కేంద్రంలో పట్టభద్రుల ఓటు నమోదు ఇన్‌ఛార్జులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామగ్రామాన తిరుగుతూ అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటు నమోదు చేయించాలని సూచించారు.ఈ బాధ్యతను ఇన్‌ఛార్జులు సమర్థంగా నిర్వర్తించాలన్నారు.రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్‌రెడ్డి గెలుపు కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు.కాంగ్రెస్ అభ్యర్థి డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఓటరు నమోదు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించి, అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదయ్యేలా కృషి చేయాలన్నారు.సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు సట్టు తిరుమలేష్, మాజీ సర్పంచ్ l ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి,కాల్వపల్లి మాజీ సర్పంచ్ గుంటి కృష్ణ,రామిల్ల నరేందర్,గంధమల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.