వాకర్స్ సభ్యులకు,క్రీడాకారులకు మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు అభ్యర్థన
ఏలూరు, మేజర్ న్యూస్ : స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఎన్ డి ఏ కూటమి బలపరిచిన ఏలూరు నగర మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు వివిధ క్రీడాకారులతో,వాకర్స్ మిత్రులతో ఏలూరు మేయర్ కూటమి అభ్యర్థిగా భారీ మెజారిటీ తో గెలిపించాలని అభ్యర్థించారు.అలాగే తనతో పాటు ఏలూరు నియోజకవర్గం లోని 62 డివిజన్ లలో ఉన్న కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమం లో స్టేడియం మార్నింగ్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పత్తిపాటి నాగ విఘ్నేశ్వర రావు ఎం జి ఎఫ్,జనసేన నాయకులు నారా శేషు,పలువురు కూటమి నాయకులు,కార్యకర్తలు,మహిళ వాకర్స్ ,జనసైనికులు పాల్గొన్నారు.