BREAKING
మత్తుకు "నో"చెప్పి జీవితాన్ని కాపాడుకోండి జడ్పీటీసీ అభ్యర్థి కండి ప్రతిమకు ఎమ్మెల్యే బేబీ నాయన ఆశీస్సులు సమంత ఆసక్తికర వ్యాఖ్యలు: సీఎం విజయ్ నా లక్కీ ఛార్మ్ అంటూ స్టార్ హీరోయిన్ ప్రశంసలు! ఎన్నికల విధుల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లు అప్రమత్తంగా ఉండాలి క్లేఫేస్ మూవీ రివ్యూ: 'జోకర్' తర్వాత డీసీ నుంచి వచ్చిన మాస్టర్‌పీస్ హర్రర్ థ్రిల్లర్! రేపు వికారాబాద్‌కు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్.. ఆర్‌ఓబీ నిర్మాణ పనుల పరిశీలన 35 వార్డులో తెలుగుదేశం కూటమి అభ్యర్థి మజ్జి త్రినాథ్ ప్రచారం నాలుగు బీర్లు తాగించి మోసం చేశారు. • ఆర్ టి ఐ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఆవేదన.... ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవాలి గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైసిపి కైవశం చేసుకుంది * మేయర్ గా వరుదు కళ్యాణి గెలుపు తథ్యం * అమెరికా వ్యాపారాలలో ధరల ఒత్తిడిని పెంచుతున్న బలమైన డిమాండ్ అంగడి చౌరస్తాలో అలుముకున్న చీకట్లు.. ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? జైలర్ 2 సినిమాలో నా సీన్స్ ట్రిమ్ చేశారు: షాకింగ్ నిజాలు బయటపెట్టిన నటి మేఘనా రాజ్ సర్జా! జీవీఎంసీ పోరులో జోరందుకున్న జనసేన ప్రచారం... భారీగా పార్టీలోకి చేరికలు ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయం....

గురవయ్య, లక్ష్మీలకు భద్రత కల్పించాలి

Select Suryaa Now
గురవయ్య, లక్ష్మీలకు భద్రత కల్పించాలి

రైల్వే కోడూరు నియోజకవర్గం, పుల్లంపేట మండలం, శ్రీరాములపేట గ్రామానికి చెందిన క్రైస్తవ మతానికి చెందిన బాధితులు గురయ్య, లక్ష్మీపై తప్పుడు కేసులతో వేదించడం దుర్మార్గమని, వారికి తక్షణమే భద్రత కల్పించాలని ఏపీ క్రిస్టియన్ సొసైటీ నేతలు అరుల్ ఆరుసు, జేమ్స్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్రైస్తవుడు గురవయ్యలపై జరిగిన దాడి పట్ల స్పందించిన సొసైటీ నేతలు శుక్రవారం కేబీ లేఔట్లోని షెకీనా చర్చలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది అక్టోబర్ 25న తన కుమారుడి పుట్టిన రోజు వేడుకలు సందర్భంగా గురవయ్య క్రైస్తవ విశ్వాసి పుట్టక దిన ప్రార్ధన చేసే సమయంలో కొందరు ప్రార్ధన చేయకూడదని వారిపై దాడి చేసి కుర్చీలు, భోజనాలు క్రింద పడేసి, బైబిల్ చించేసి సంఘటన జరిగిందని తెలిపారు. దీనిపై అప్పుడు అదే నెల 18న ఆరుగురిపై ఫిర్యాదు చేస్తే అందులో ఐదుగురిపై కేసు పెట్టినా ఎస్ఐ శివకుమార్, ఏఎస్ఐ పిచ్చయ్య ఆ కేసులో ముఖ్య వ్యక్తి అయిన మనోహర్ రెడ్డి అనే వ్యక్తిని తప్పించారని తెలిపారు. దీనిపై కక్ష పెంచుకున్న పుల్లంపేట ఎస్ఐ దేవాలయం ముందు మత ప్రచారం చేశారని గురవయ్యపై ఆపద్దపు కేసు పెట్టారన్నారు. ఈ ఏడాది జన్మదిన వేడుకలకు అనుమతి కోసం గత నెల 29న జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడంతో తహసిల్దార్ అనుమతి ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించిన అనువతి ఇవ్వలేదన్నారు. మాజీ సర్పంచ్ మణికంఠ ఆలయ నిర్మాణం పేరుతో గ్రామస్తుల వద్ద సంతకాలు చేసుకొని ఆ సంతకాల ముసుగులో రాజకీయ బలంతో గురవయ్యపై హత్యాప్రయత్నం చేశారంటూ కేసు పెట్టి బెదిరించడమే కాక వారిని ఊరువదలి వెళ్లిపోవాలనడం వడ్డూరమన్నారు. బాధిత కుటుంబానికి భద్రత కల్పించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సొసైటీ నేతలు ఆర్ఎస్.జార్డర్స్, హనీజాన్సన్, టీఎస్.కుమార్ పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్