ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నగరాభివృద్ధి ఖాయం
- యువ కార్పొరేటర్ పీఎస్ చందు
- మేయర్ గా కటారి హేమలతను గెలిపించండి
- 52లో చందు ప్రచారం జోరు
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదేశాల మేరకు, ఆయన ఆధ్వర్యంలో చిత్తూరు నగరం మరింత అభివృద్ధి సాధించడం ఖాయమని 52వ డివిజన్ యువ కార్పొరేటర్ పీఎస్ చందు అన్నారు.
శుక్రవారం కార్పొరేటర్ చందు ఆధ్వర్యంలో 52వ డివిజన్ పరిధిలోని కైలాసపురం అంకాల పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేయర్ అభ్యర్థి కటారి హేమలతకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా చందు తండ్రి, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం మాట్లాడుతూ ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆధ్వర్యంలో రోడ్ల వెడల్పు, సీసీ రోడ్లు, కల్వర్టులు, డ్రైనేజీలతో నగరం అభివృద్ధి బాటలో పయనిస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జ్ భువనేశ్వరి, 51వ డివిజన్ కార్పొరేటర్ గణేష్, మాజీ కార్పొరేటర్ కుప్పన్న, ఉపాధ్యక్షురాలు దుర్గ, ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, పాల్గొన్నారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్.. లవ కుమార్