జడ్పీటీసీ అభ్యర్థి కండి ప్రతిమకు ఎమ్మెల్యే బేబీ నాయన ఆశీస్సులు
బాడంగి, సూర్య : బాడంగి మండల జడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కండి ప్రతిమ శుక్రవారం బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీ నాయన)ను మర్యాదపూర్వకంగా కలిశారు. అదే విధంగా బుడా చైర్మన్ తెంటు లక్ష్ము నాయుడు ను కూడా కలిసారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే, బుడా చైర్మన్ లు ఆమెకు ఆశీస్సులు అందజేస్తూ, పార్టీ విజయానికి సమష్టి కృషి చేయాలని సూచించినట్లు తెలిసింది. ప్రజలతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకుంటూ, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని ఆమెకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో ప్రజల్లో నమ్మకం పెంచుకుంటూ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కృషి చేయాలని ఆకాంక్షించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో వారితోపాటు మాజీ సర్పంచ్ కండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : శ్రీనివాసరావు, బాడంగి, విజయనగరం జిల్లా.