BREAKING
ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ పరీక్షలు దర్శి నియోజకవర్గంలోప్రశాంతంగా ముగిసిన నామినేషన్ లు. అందోల్ నియోజకవర్గ లో అలై బలై కార్యక్రమం మంత్రి దామోదర్ రాజనర్సింహం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మారెడ్డి రాజశేఖర్ రెడ్డి! నార్పల జడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన సీనియర్ నాయకుడు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ నామినేషన్ దాఖలు లక్కీ డ్రా నిర్వాహకుల అరెస్ట్ అలాస్కా సెనేట్ ఎన్నికల ఫలితాలపై ట్రంప్ యంత్రాంగం న్యాయపోరాటం ఫుట్ పాత్ లు మాయం.. రోడ్లపైకి వస్తున్న కమర్షియల్ షట్టర్లు.. హడావిడి పనులే కొంపముంచేయ భారత్ పెట్రోలియం లాభాల్లో క్షీణత...ముడి చొట్ల ధరల ఒడుదొడుకులే కారణం కోటపాటి వైపు టీడీపీ అధిష్ఠానం చూపు మిసెస్ యూనిటీ వరల్డ్ ఆశా దీపిక అట్టలూరికి ఘన స్వాగతం హింసతో ఎన్నికల ప్రక్రియను శాసిస్తే సహించేది లేదు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో, సురభి కళాక్షేత్రం లో అలరించిన బాల కళాకారులు చంద్రశేఖరపురం జడ్పీటీసీ బరిలో కోటపాటి జనార్దనరావు

ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయం....

Select Suryaa Now
ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయం....

..

అమర పోలీసు హెడ్ కానిస్టేబుల్ బడే సాహెబ్ కుటుంబాన్ని పరామర్శించిన అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డ:


సూర్యాపేట క్రైమ్ మేజర్ న్యూస్ 
పోలీసు ఫ్లాగ్ డే వారోత్సవాలు–2026 పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి ఈరోజు సూర్యాపేట పట్టణంలో నివసిస్తున్న పోలీసు అమరవీరుడు హెడ్ కానిస్టేబుల్ బడే సాహెబ్ కుటుంబ సభ్యులను వారి నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల సమక్షంలో బడే సాహెబ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ప్రాణాలకు  ఆస్తులకు రక్షణ కల్పిస్తూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. 2000 సం.లో తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌పై నక్సలైట్లు దాడి చేసిన సమయంలో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ బడే సాహెబ్ వారితో వీరోచితంగా పోరాడి అమరులయ్యారని గుర్తుచేశారు. విధి నిర్వహణలో ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన ఆయన పోలీసు శాఖకు గర్వకారణమని అన్నారు.
పోలీసు అమరవీరుల త్యాగాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని వారి త్యాగఫలితంగానే ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించగలుగుతున్నారని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల పోలీసు శాఖ ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని  అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పోలీసు ఫ్లాగ్ డే వారోత్సవాల సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతోపాటు, వారి సేవలను ప్రజలకు తెలియజేయడం, వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను తెలుసుకోవడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. దేశం కోసం ప్రజల భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులను ప్రతి పౌరుడు గౌరవించాలని వారి త్యాగాలను ఎల్లప్పుడూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ కార్యదర్శి కిరణ్ అమర పోలీసు బడే సాహెబ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.