గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైసిపి కైవశం చేసుకుంది * మేయర్ గా వరుదు కళ్యాణి గెలుపు తథ్యం *
విశాఖపట్నం, సూర్య : గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైయస్సార్ పార్టీ కార్పొరేటర్లు అత్యధిక స్థానాల్లో గెలుపొందుతారని, అదేవిధంగా మేయర్ గా వరదుకళ్యాణ్ గెలుపు తధ్యమని దక్షిణ నియోజకవర్గం వైయస్సార్ పార్టీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన పార్టీ కార్యాలయంలో శుక్రవారం మేయర్ తో పాటు కార్పొరేటరు అభ్యర్థులు,పార్టీ శ్రేణులతో ఎన్నికల వ్యూహంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గం నుండి కార్పొరేటర్ స్థానాల్లో పోటీల్లో నిలిచిన అభ్యర్థులు తమ ప్రచారంలో కూటమి అక్రమాలు అరాచకాలపై ప్రజలకు వివరించాలని సూచించారు. చంద్రబాబు ఎన్నికల ముందు హామీలు పూర్తిగా పక్కన పెట్టారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లా ల ని అన్నారు. నగర పరిధిలో ప్రతి వార్డులో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి కొరత పారిశుద్ధ్య లోపాల పై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కలిగేలా ప్రచారం నిర్వహించాలని, అభ్యర్థులు, కార్యకర్తలకు ఉద్బోధించారు. దక్షిణ నియోజకవర్గంలో వైయస్సార్ పార్టీ వరుదు కళ్యాణ్ అన్ని వార్డుల్లో మెజార్టీ తీసుకురావడానికి ప్రతి ఒక్క కార్యకర్త,నాయకుడు శ్రమించాలని పిలుపునిచ్చారు. మేయర్ అభ్యర్థి కళ్యాణి మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో వైయస్సార్ పార్టీకి వాసుపల్లి గణేష్ కుమార్ లాంటి నాయకుడు ఉండడం పార్టీకి గొప్ప బలం అన్నారు. కార్పొరేటర్ అభ్యర్థులు, శ్రేణులు, పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి కూటమి పాలన లో ప్రజలపై పడుతున్న ధరలబారం ఇతర ఇబ్బందులను వారి ముందు వచ్చి ఓటర్లను వైయస్సార్ కాంగ్రెస్ వైపు మళ్లీంచే లా కృషి చేయాలి అన్నారు. మేయర్ గా విజయం సాధిస్తే విశాఖ అభివృద్ధి తో పాటు పార్టీ శ్రేణులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీకి చెందిన కార్పొరేటర్ అభ్యర్థులు వార్డు పార్టీ శ్రేణులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : సత్యనారాయణ, ఒన్‌టౌన్, విశాఖపట్నం.