BREAKING
అందోల్ నియోజకవర్గ లో అలై బలై కార్యక్రమం మంత్రి దామోదర్ రాజనర్సింహం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మారెడ్డి రాజశేఖర్ రెడ్డి! నార్పల జడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన సీనియర్ నాయకుడు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ నామినేషన్ దాఖలు లక్కీ డ్రా నిర్వాహకుల అరెస్ట్ అలాస్కా సెనేట్ ఎన్నికల ఫలితాలపై ట్రంప్ యంత్రాంగం న్యాయపోరాటం ఫుట్ పాత్ లు మాయం.. రోడ్లపైకి వస్తున్న కమర్షియల్ షట్టర్లు.. హడావిడి పనులే కొంపముంచేయ భారత్ పెట్రోలియం లాభాల్లో క్షీణత...ముడి చొట్ల ధరల ఒడుదొడుకులే కారణం కోటపాటి వైపు టీడీపీ అధిష్ఠానం చూపు మిసెస్ యూనిటీ వరల్డ్ ఆశా దీపిక అట్టలూరికి ఘన స్వాగతం హింసతో ఎన్నికల ప్రక్రియను శాసిస్తే సహించేది లేదు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో, సురభి కళాక్షేత్రం లో అలరించిన బాల కళాకారులు చంద్రశేఖరపురం జడ్పీటీసీ బరిలో కోటపాటి జనార్దనరావు సామాజిక సేవలతోనే గుర్తింపు..-ఎస్సై తోట తిరుపతి సీఎస్‌పురం జడ్పీటీసీగా కోటపాటి నామినేషన్

ఎన్నికల విధుల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లు అప్రమత్తంగా ఉండాలి

Select Suryaa Now
ఎన్నికల విధుల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లు అప్రమత్తంగా ఉండాలి

శ్రీకాకుళం, సూర్య : ఎన్నికల విధుల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు–2026 నేపథ్యంలో మైక్రో అబ్జర్వర్లకు వీడియో ప్రదర్శన ద్వారా స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లు,   ఎన్నికల జనరల్ పరిశీలకులుగా నియమితులైన మల్లవరపు. సూర్యతేజ వారి ఆధ్వర్యంలో పనిచేయాలని, ఎన్నికల విధుల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లుగా చేపట్టాల్సిన బాధ్యతలు, చెక్ లిస్టు ప్రకారం పాటించాల్సిన నిబంధనలను ఈ శిక్షణ ద్వారా పూర్తిగా తెలుసుకోవాలని, ఎన్నికల ప్రక్రియ  నిష్పక్షపాతంగా, పారదర్శకంగా  నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలింగ్ అధికారులకు పూర్తి అవగాహన  ఉండాలని.  ఓటింగ్ ప్రక్రియ సజావుగా, స్వేచ్ఛగా జరిగేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత పోలింగ్ అధికారుల పై ఉంటుందని తెలిపారు.
అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటంతో పాటు, 
మైక్రో అబ్జర్వర్లుగా  ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం విధులను బాధ్యతతో నిర్వహించాలని, పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని ఓటర్ల స్వేచ్ఛకు భంగం కలగకుండా, ఎలాంటి ఒత్తిళ్లు లేదా ప్రలోభాలకు లొంగకుండా పోలింగ్ సక్రమంగా జరిగేలా పని చేయాలని ఆయన సూచించారు.

పోలింగ్ అధికారిగా మీతో కలిసి పనిచేసే సిబ్బంది ఎన్నికల నియమ నిబంధనలను పాటిస్తున్నారో లేదో పరిశీలించాలని.  ఎన్నికల ప్రక్రియలో ఏవైనా అవకతవకలు లేదా నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని గుర్తిస్తే, సంబంధిత ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, పోలింగ్‌కు సంబంధించిన ముఖ్యమైన అంశాలను నిర్దేశిత నివేదికలో నమోదు చేసి, ఉన్నతాధికారులకు సమర్పించాలని స్పష్టం చేశారు.విధుల నిర్వహణలో నిష్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించడంలో మైక్రో అబ్జర్వర్ల  పాత్ర కీలకమని, మీకు కేటాయించిన విధులను పూర్తి బాధ్యతతో నిర్వహించి, ప్రజాస్వామ్య  ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో  సెట్ శ్రీ,  సీఈఓ, వి.విశ్వేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఎ. రవిబాబు, జిల్లా పంచాయతీ అధికారి, స్వరూపారాణి, ఎల్. డి .ఎం, పి. శ్రీనివాసరావు మాస్టర్ ట్రైనర్స్ బలివాడ సతీష్ కుమార్, కె. శేషగిరి, పి. నారాయణ రావు, వివిధ బ్యాంకుల అధికారులు, పోస్టల్ ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్ ,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.