పోలీసుల విధులపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన
పోలీసుల విధులపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన
-రూరల్ సీఐ విద్యాసాగర్
సిద్దిపేట రూరల్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో మాస్టర్ మైండ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కు చెందిన సుమారు 70 మంది విద్యార్థులు సందర్శించారు.ఈ సందర్భంగా రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుంచే చట్టాలపై అవగాహన కల్పించడం, పోలీసుల విధులు, బాధ్యతలను తెలియజేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. పోలీస్ స్టేషన్ పనితీరు, ఆయుధాలు, డయల్ 112 అత్యవసర సేవలు, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రజల రక్షణలో పోలీసుల సేవలను వివరించారు.ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్‌ఐ డి. నవత, చిన్నకోడూరు ఎస్‌ఐ చంద్రమోహన్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
(సూర్య రూరల్, రమేష్)