చివరి రోజు 41 నామినేషన్లు
బాడంగి, సూర్య : మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు 41 నామినేషన్లు దాఖలు కాగా, మూడు రోజుల్లో కలిపి మొత్తం 60 నామినేషన్లు నమోదయ్యాయి. గట్టి పోలీసు భద్రత నడుమ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
మొత్తం నామినేషన్లలో తెలుగుదేశం పార్టీ తరఫున 28, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 26, జనసేన తరఫున రెండు, కాంగ్రెస్ తరఫున ఒకటి, స్వతంత్ర అభ్యర్థులుగా మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోగా, రెండో రోజు 19, చివరి రోజు 41 నామినేషన్లు నమోదయ్యాయి.బాడంగి ఎస్‌ఐ పి. సూర్యకుమారి ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. బొబ్బిలి డీఎస్పీ ఆర్. గోవిందరావు నామినేషన్ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల అధికారి ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని గొల్లాది, గజరాయునివలస, డొంకినవలస, కోడూరు-1, కోడూరు-2, వాడాడ, రేజేరు, కోటిపల్లి, బొత్సవానివలస, పాల్తేరు, బాడంగి, గూడెపువలస, ముగడ, వీరసాగరం ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
రిపోర్టర్ : శ్రీనివాసరావు, బాడంగి, విజయనగరం జిల్లా.