BREAKING
సమంత ఆసక్తికర వ్యాఖ్యలు: సీఎం విజయ్ నా లక్కీ ఛార్మ్ అంటూ స్టార్ హీరోయిన్ ప్రశంసలు! ఎన్నికల విధుల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లు అప్రమత్తంగా ఉండాలి క్లేఫేస్ మూవీ రివ్యూ: 'జోకర్' తర్వాత డీసీ నుంచి వచ్చిన మాస్టర్‌పీస్ హర్రర్ థ్రిల్లర్! రేపు వికారాబాద్‌కు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్.. ఆర్‌ఓబీ నిర్మాణ పనుల పరిశీలన 35 వార్డులో తెలుగుదేశం కూటమి అభ్యర్థి మజ్జి త్రినాథ్ ప్రచారం నాలుగు బీర్లు తాగించి మోసం చేశారు. • ఆర్ టి ఐ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఆవేదన.... ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవాలి గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైసిపి కైవశం చేసుకుంది * మేయర్ గా వరుదు కళ్యాణి గెలుపు తథ్యం * అమెరికా వ్యాపారాలలో ధరల ఒత్తిడిని పెంచుతున్న బలమైన డిమాండ్ అంగడి చౌరస్తాలో అలుముకున్న చీకట్లు.. ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? జైలర్ 2 సినిమాలో నా సీన్స్ ట్రిమ్ చేశారు: షాకింగ్ నిజాలు బయటపెట్టిన నటి మేఘనా రాజ్ సర్జా! జీవీఎంసీ పోరులో జోరందుకున్న జనసేన ప్రచారం... భారీగా పార్టీలోకి చేరికలు ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయం.... ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నగరాభివృద్ధి ఖాయం రామాయణం అడ్వాన్స్ బుకింగ్ సునామీ: ఆదాపురుష్ రికార్డులను తుడిచిపెట్టేసిన రణ్‌బీర్ కపూర్ సినిమా!

టిడిపి తరఫున రాజగోపాల్ నామినేషన్

Select Suryaa Now
టిడిపి తరఫున రాజగోపాల్  నామినేషన్

 

పరిగి మేజర్ న్యూస్: శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ చివరి రోజైన శుక్రవారం  టీడీపీ తరుపున శిరేకోళం–హోన్నంపల్లి ఎంపీటీసీ స్థానానికి రాజగోపాల్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలనే లక్ష్యంతో ఆయన ఎన్నికల బరిలో నిలిచారు.రాజగోపాల్‌ ప్రజలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ తన పరిధిలో సాధ్యమైనంత మేరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. దానధర్మాలు చేయడంతో పాటు వివిధ దేవాలయాలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తూ సామాజిక సేవలో భాగస్వామిగా నిలుస్తున్నారని తెలిపారు.ప్రజలకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉండటం, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం వంటి సేవా కార్యక్రమాల ద్వారా రాజగోపాల్‌ గుర్తింపు పొందారని స్థానికులు చెబుతున్నారు. ఎంపీటీసీగా అవకాశం లభిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు శ్రీకోళం, పొన్నంపల్లి గ్రామాల అభివృద్ధికి తనవంతు సహకారం అందించాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు.ప్రజాసేవను లక్ష్యంగా చేసుకుని రాజగోపాల్‌ నామినేషన్‌ దాఖలు చేయడంతో శ్రీకోళం–పొన్నంపల్లి ఎంపీటీసీ స్థానం ఎన్నికలపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.