విద్యార్థులకు పోలీసుల విధులపై అవగాహన
విద్యార్థులకు పోలీసుల విధులపై అవగాహన
చేర్యాల పోలీస్‌స్టేషన్‌లో ఓపెన్‌హౌస్ కార్యక్రమం
చేర్యాల మేజర్ న్యూస్ .....
చేర్యాల: చేర్యాల పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఎస్సై జి. అపూర్వారెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ఓపెన్‌హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల విధులు, బాధ్యతలు, పోలీస్‌స్టేషన్ పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అందినప్పటి నుంచి దానిపై తీసుకునే చర్యలు, కేసు నమోదు, దర్యాప్తు తదితర ప్రక్రియలను ఎస్సై విద్యార్థులకు వివరించారు. ప్రజల రక్షణ కోసం విధులు నిర్వహిస్తూ ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలను గుర్తుచేసుకుని నివాళులర్పించారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పోలీసు వ్యవస్థపై అవగాహన పెంపొందించడంతో పాటు, పోలీసుల సేవలు, త్యాగాల గురించి వివరించారు.