BREAKING
సిరమ్మకు లైన్ క్లియర్! *సర్పంచ్‌ పై కాంగ్రెస్ నాయకుల దాడి.. ప్రజాస్వామ్యం పై దౌర్జన్యమా జిఎంఆర్* కాకాణి సమక్షంలో తెలుగుదేశంని వీడి వైఎస్ఆర్‌సీపీలో చేరిన 50 కుటుంబాలు శ్రీకాళహస్తి డివిజన్ లో నామినేషన్లు తిరస్కరణకు గురైతే అప్పీల్ చేసుకోండి ఆర్డిఓ భాను ప్రకాశ్ రెడ్డి రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎంపీకి వినతిపత్రం పర్చూరు నియోజకవర్గంలో జడ్పీటీసీ స్థానాల్లో విజయకేతనం ఎగురవేయాలి : ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్ని ఎంపీటీసీ నామినేషన్లు ఆమోదం.. * 27 వరకు ఉపసంహరణ గడువు * ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని 26వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జయమ్మ ప్రచారం ఎంఫార్మసీ, బీఫార్మసీ పేమెంట్ సీట్ల స్పాట్ అడ్మిషన్లు విదేశీ పెట్టుబడుల ఆంక్షల పెంపు నిర్ణయాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ 40వ డివిజన్‌లో కోటంరెడ్డి లక్ష్మి హైందవి ఎన్నికల ప్రచారం రైతులకు భూ పరిహార చెక్కులు అందజేత నెల్లూరు రూరల్ ప్రచార పర్వంలో ఎంపీ వేమిరెడ్డి యోగా పోటీలకు ఎంపికైన శ్రీ సత్యసాయి విద్యా విహార్ విద్యార్థులు రష్యాలో ఘోర రోడ్డు ప్రమాదం...రైలు ఢీకొని ఆరుగురు దుర్మరణం

దక్షిణ నియోజకవర్గంలో ఓటర్ స్లిప్పుల పంపిణీ

Select Suryaa Now
దక్షిణ నియోజకవర్గంలో ఓటర్ స్లిప్పుల పంపిణీ

విశాఖపట్నం, సూర్య : గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం ఓటర్ స్లిప్పుల పంపిణీ అధికారికంగా మొదలయింది. దక్షిణ నియోజకవర్గ పరిధిలో 32వ వార్డ్ కుమ్మరి వీధి లో సచివాలయం సిబ్బంది ఓటర్ జాబితా ప్రకారంగా ఓటర్ లిస్టులో ఉన్న వారికి ఓటర్ స్లిప్పులను అందించారు. గ్రేటర్ విశాఖ ఎన్నికలు నవంబర్ ఒకటో తారీఖున జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జీవీఎంసీ సచివాలయం సిబ్బంది వన్ టౌన్ పరిధిలో కోటవీధి, జాలరి పేట కనకమాలక్ష్మి టెంపుల్ ఏరియాలోని బుర్జుపేట ఏవిఎన్ కాలేజీ, పూర్ణ మార్కెట్, డాబా గార్డెన్స్ సూర్య బాగ్, కళ్ళుపాకలు టౌన్ కొత్త రోడ్ ప్రాంతాల్లో పలు వార్డులకు సంబంధించి ఓటర్ స్లిప్పులను ఓటర్లకు అందజేశారు.  పోలింగ్ రోజున ఓటర్లు నేరుగా ఓటర్ స్లిప్పులను  పట్టుకొని వారికి కేటాయించిన పోలింగ్ బూత్ వద్దకు వెళ్లి స్లిప్పులు అందజేసి ఓటు  వేయవచ్చునని సిబ్బంది ఓటర్లకు వివరించారు. గతంలో పోలింగ్ కేంద్రాల వద్ద రాజకీయ పార్టీలకు సంబంధించి శిబిరాలు ఏర్పాటు చేసి ఓటర్ స్లిప్పు అందించి హడావిడి సృష్టించేవారు. ప్రశాంతంగా ఎన్నికలు ప్రక్రియ జరిగే విధంగా ఎన్నికల కమిషన్ ప్రత్యేక చర్యలకు దిగింది. ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రత్యేక చర్యలకు జీవీఎంసీ ఎన్నికల అధికారులు దిగారు. ఓటు వేసేందుకు నగర ప్రజానీకం ఉత్సాహంగా ఓటర్ పంపిణీ చేస్తున్న సచివాలయం సిబ్బంది వద్దకు వచ్చి ఓటరు జాబితాలో ఓటు ఉన్నది లేనిది తెలుసుకునేందుకు ఉత్సాహపడ్డారు. ఓటర్ లిస్టులో ఓటు ఉండడంతో  అత్యుత్సాహంగా మహిళలు యువకులు ఇంట్లో వారందరి ఓటర్ సిల్క్ లు తీసుకొని వెళ్లారు. వార్డుల్లో ప్రధాని పార్టీకి చెందిన అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. దీంతో ఎటువంటి రాజకీయ సందడి లేకుండా దక్షిణ పరిధిలో పలు వార్డుల్లో ఓటర్ స్లిప్పుల పంపిణీ సజావుగా సాగింది.

రిపోర్టర్ : సత్యనారాయణ, ఒన్‌టౌన్, విశాఖపట్నం.