ప్రశాంత వాతావరణంలో నామినేషన్లు పక్రియ...ఎంపీ లావు
నరసరావుపేట :వైసీపీ నాయకులు కూడా నిర్భయంగా నామినేషన్లు దాఖలు చేయాలని వారికి పూర్తి సహకారం అందిస్తామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీ నేతలు ముందుకు రావడం లేదని, నామినేషన్లు దాఖలు చేసిన వారు సైతం వాటిని ఉప సంహరించుకుంటున్నారని వ్యాఖ్యానిం చారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా జరగాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ నామినేషన్ దాఖలు చేసే హక్కు ఉందని స్పష్టం చేశారు. అయితే, నామినేషన్ కేంద్రాల వద్ద వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు అందరూ సహకరించాలని సూచించారు.
మల్లికార్జున్ పల్నాడు జిల్లా ఇన్చార్జి